Site icon Prime9

Brahmastra: అలియాభట్, రణబీర్ కపూర్ లను అడ్డుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు

Alia-Ranbir-stopped-by-Bajrang-Dal-activist

Bollywood: బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్‌లు కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో వీరిరువురు మంగళవారం రాత్రి ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయానికి దర్శనానికి వచ్చారు. అయితే వీరిని గుడిలోకి ప్రవేశించకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేసారు.

మటన్, చికెన్ మరియు బీఫ్ తినడానికి ఇష్టపడతానని రణబీర్ కొద్ది రోజుల క్రితం చెప్పినందున మేము వారిని పవిత్ర మహాకాళేశ్వర్ ఆలయంలో పూజించడానికి అనుమతించము” అని బజరంగ్ దళ్ నాయకుడు అంకిత్ చౌబే మీడియాతో చెప్పారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రం తన దర్శనం అనంతరం సోషల్ మీడియాలో చిత్రాన్ని షేర్ చేసి ఇలా రాసాడు. ఈరోజు మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించినందుకు చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఫీల్ అవుతున్నాను. అత్యంత సుందరమైన దర్శనం పొందాను. బ్రహ్మాస్త్రం పై చిత్ర నిర్మాణ ప్రయాణాన్ని ముగించడానికి మరియు విడుదల కోసం సానుకూల శక్తిని మరియు ఆశీర్వాదాలను పొందడానికి ఈ దేవాలయ సందర్శన చేయాలనుకున్నాను.

మరోవైపు బ్రహ్మాస్త్రను బహిష్కరించాంటూ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version