Aishwarya Rai: చిత్ర సీమలో ఒక ఇండస్ట్రీకి .. మరో ఇండస్ట్రీకి గట్టి పోటీ ఉంటుంది. అందుకే ఆయా ఇండస్ట్రీలకు చెందిన అభిమానులు ఎప్పుడూ ఈ పోటీ గురించి చర్చించుకుంటారు. రీసెంట్ ఇదే టాపిక్ పై మాజీ వరల్డ్ సుందరి ఐశ్వర్య రాయ్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
‘ఇటీవల దక్షిణాది ఇండస్ట్రీ.. బాలీవుడ్ కంటే బాగా పాపులర్ అవుతోందని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి?’ అన్న ప్రశ్నకు ఐశ్వర్య ఏమని సమాధానం చెప్పిదంటే..‘ నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ చిత్రంగా అనుకుంటాను. ఒకదానిపై మరొకటి ఓవర్ టేక్ చేస్తుందనే అభిప్రాయాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట వాటి కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా రాకపోతే మరొక ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకునే వీలు ఉంటుంది. నాకు సౌత్ లోనూ పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చింది.
మణిరత్నం, శంకర్.. ఇలా అగ్ర దర్శకుల సినిమాల్లో నటించాను. సినిమా రంగం చాలా గొప్పది. ఏ సినిమా విజయం సాధించినా.. అది భారతీయ చిత్ర విజయంగానే తీసుకుంటాను’ అని ఐశ్వర్య చెప్పింది. దీనిపై నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు. ‘ఇంత తెలివిగా సమాధానం చెప్పడం మీకు మాత్రమే సాధ్యం’ అంటూ ఐశ్వర్య ఆన్సర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఐశ్వర్య కీలక పాత్రలో నటించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నందినిగా అలరించారు. ఇలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని ఐశ్వర్య సినిమా ప్రమోషన్ లో తెలిపింది.