Site icon Prime9

Actor Sathish Kaushik : చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ మృతి

bollywood actor sathish kaushik passed away

bollywood actor sathish kaushik passed away

Actor Sathish Kaushik : చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఈ వరుస విషాదలతో సినీ పరిశ్రమ కోలుకోలేని విషాదంలో మునిగిపోతుంది. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. వారి మరణ వార్తలనే ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉండగానే ఇప్పుడు తాజాగా మరో విషాదం చోటు చేసుకోవడం మరింత శోచనీయం అని చెప్పాలి. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు  సతీష్ కౌశిక్ ఈరోజు ఉదయాన్నే ఈ లోకాన్ని వీడినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా నిన్ననే ( బుధవారం రోజు) జుహులో తన స్నేహితులు,సహా నటులతో కలిపి హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఆ ఫటోలను ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు. ఈలోపే ఆయన మృతి చెందడం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

 సతీష్ కౌశిక్ సినిమాలు, అవార్డులు..

సతీష్ కౌశిక్ కెరీర్ మల్టీటాలెంటెడ్ పర్సన్ సతీష్ కౌశిక్. ఏప్రిల్ 13, 1965న హర్యానాలో జన్మించాడు. సతీష్ కౌశిక్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ఇండియన్ డ్రామా మసూమ్‌తో సతీష్ ఫిల్మ్ ఇండస్ట్రి లోకి అరంగేట్రం చేశారు. జానే భీ దో యారో, ఉత్సవ్, సాగర్, సజన్ చలే ససురల్, దీవానా మస్తానా, బ్రిక్ లేన్, కాగజ్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ఇటీవల రిలీజ్ అయిన  ఛత్రివాలి చిత్రంలో కూడా సందడి చేశారు. అదే విధంగా సతీష్ కౌశిక్ 1990లో రామ్ లఖన్ , 1997లో సాజన్ చలే ససురల్ చిత్రాలకు గానూ.. ఉత్తమ హాస్యనటుడుగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం..

కాగా కేవలం నటుడిగానే కాకుండా సతీష్ కౌశిక్.. పలు చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మించారు. శేఖర్ కపూర్‌ దర్శకత్వం వహించిన మాసూమ్ సినిమాకు.. సతీష్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. రూప్ కీ రాణి చోరోన్ కా రాజా (1993)తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై, ముజే కుచ్ కెహనా హై, బధాయి హో బధాయి, తేరే నామ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలానే ఆటంక్ హాయ్ ఆటంక్ సినిమాతో నిర్మాతగా మారిన సతీష్ కౌశిక్.. మిస్టర్ బెచారా, క్యోన్ కి, ధోల్, బమ్ బం బోలే, గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు.

సతీష్ కౌశిక్ చివరి ట్వీట్ గా  హోలీ వేడుక సందర్భంగా తీసిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సతీష్ రిచా చద్దా, అలీ ఫజల్‌తో కలిసి హోలీని జరుపుకున్నారు. అంతకు ముందు  తన స్నేహితుడు అనుపమ్ ఖేర్‌కు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా నటుడు, సతీష్ స్నేహితుడు అయిన  అనుపమ్ ఖేర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version