Site icon Prime9

Balakrishna 108 : బాలయ్య 108 లో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్.. ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అంటూ డైలాగ్!

bollywood actor arjun rampaul acting in balakrishna 108 movie

bollywood actor arjun rampaul acting in balakrishna 108 movie

Balakrishna 108 : నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో 108 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.  కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా.. యంగ్ సెన్సేషన్ శ్రీ లీల ఒక ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. బాలయ్య గత సినిమాలకు ఏ మాత్రం తగ్గేదే లే అనేట్లుగా ఈ సినిమాలో తన మార్క్ కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. వీర సింహారెడ్డి చిత్రంలో విలన్ గా కన్నడ నటుడుని ఎంపిక చేయగా.. ఈ మూవీలో బాలీవుడ్ నటుడిని బాలయ్యకి విలన్ గా రంగం లోకి దించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ “అర్జున్ రాంపాల్” నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించింది. అదే విధంగా ఆయనకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో ‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అనే బాలయ్య డైలాగ్ ని అర్జున్ రాంపాల్ చెప్పారు. అంతే కాదు, అనిల్ రావిపూడి సినిమాలో మంచి మంచి డైలాగులు ఉన్నాయని ఆయన వివరించారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు థాంక్స్ అంటూ నమస్కారం పెట్టారు.

మరి సినిమాలో అర్జున్ విలన్ పాత్ర చేస్తున్నారా? లేదా మరేదైనా ముఖ్య పాత్ర చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బాక్స్ లు బద్దలు కొట్టిన తమన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బాలకృష్ణ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

 

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాధించిన బాలయ్య.. వీరసింహారెడ్డితో అదే జోరుని కంటిన్యూ చేశారు.  మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఇవే కాకుండా అటు కమర్షియల్ యాడ్స్ లోనూ దుమ్ము దులుపుతున్నాడు బాలకృష్ణ.

Exit mobile version