Site icon Prime9

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

Bobby Deol First Look From Hari Hara Veeramallu: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ నుంచి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. ఇవాళ (జనవరి 27) బాబీ డియోల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ ఆయన ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో ఆయన సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. రాజుల కాలం నాటి దుస్తుల్లో కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్దమైన వీరుడిగా కనిపించారు. కాగా ఈ సినిమాలో ఆయన విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన లుక్‌ చూస్తుంటే మొగల్‌ చక్రవర్తిగా కనిపించారు. ప్రస్తుతం బాబీ డియోల్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆయన లుక్‌ నెటిజన్స్‌ నుంచి మంచి మంచి స్పందన వస్తోంది.

కాగా ‘హరి హర వీరమల్లు’ మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేసింది. ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్‌ వదులుతూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, అప్‌డేట్స్‌కి మంచి స్పందన వస్తోంది. అలాగే ఇటీవల విడుదలైన తొలి సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ పాడిన “వినాలి.. వీరమల్లు మాట వినాలి” అనే ఈ పాటకు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో మూవీపై మంచి బజ్‌ నెలకొంది.

కాగా ఈ చిత్రాన్ని రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘హరిహర వీరమల్లు పార్ట్‌: ది స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో ఫస్ట్‌ పార్ట్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చేతికి వెళ్లింది. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏమ్‌ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్‌, అనుపమ్‌ ఖేర్‌, అర్జున్‌ రాంపాల్‌, నోరాహి ఫతేహి, విక్రమ్‌ జిత్‌, జిషుసేన్‌ గుప్త ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar