Site icon Prime9

Vijay Antony: విడాకులు తీసుకుంటున్న మరో స్టార్ హీరో..!

is vijay Antony taking divorce

is vijay Antony taking divorce

Vijay Antony: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, విడాకులు కామన్‌ అయిపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటీనటులు, స్టార్ హీరోలు, హీరోయిన్లు విడాకులు తీసుకున్నారు.
టాలీవుడ్‌ లో ప్రస్తుతం సమంత– అక్కినేని నాగచైతన్య విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో జంట తమ వైవాహిక జీవితం నుంచి విడిపోయేందుకు సిద్ధం అయ్యింది.

తమిళ- తెలుగు అభిమానులుకు బిచ్చగాడు సినిమాతో అత్యంత చేరువైన హీరో విజయ్ ఆంటోనీ. కాగా ఈ నటుడూ విడాకులకు సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ తన భార్య ఫాతిమాకు విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విజయ్ చేసిన ట్వీట్ దీనికి బలం చేకూర్చేలా  కనిపిస్తుంది. ఈ ట్వీట్ తో సినీ అభిమానులు విజయ్ కు తన భార్యకు మధ్య విభేదాలున్నాయా, వారిద్దరూ విడిపోవాలనుకుంటున్నారా, వారి జీవితంలోకి వచ్చిన మూడో వ్యక్తి ఎవరు? అంటూ పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయ్ “కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోండి. కానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకండి. మూడో వ్యక్తి రావడం వల్ల నాశనం జరుగుతుందని, ఆ నాశనాన్ని చూసి వారు ఆనందిస్తారంటూ” ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. అయితే 2006లో విజయ్, ఫాతిమా అనే సినీ నిర్మాతను పెళ్లి చేసుకోగా వారికి లారా అనే కూతురు ఉంది.

ఇదీ చదవండి: అల్లుఅర్జున్ కు మరో అరుదైన అవార్డ్.. తొలి సౌత్ హీరోగా రికార్డ్

Exit mobile version