Prasad Imax : తెలుగు ప్రేక్షకులకు సినిమాలఉన్న మక్కువ, ఇష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారు మన తెలుగు వారు. ఇక ప్రతివారం తమ ఏదో ఒక కొత్త సినిమాలు థియేటర్లను పలకరిస్తూనే ఉంటాయి. ఇక హైదరాబాద్ లో ఈ హడావిడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. నగరంలోని పలు ఏరియాల్లో కొత్త మూవీ రిలీజ్ అయ్యేప్పుడు ఉండే హడావిడి గురించి తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ అంటే మీడియా ఆడియన్స్ అభిప్రాయాల కోసం రివ్యూలు అడగడం మనం గమనించవచ్చు. కానీ ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఇలా అందరూ రివ్యూల కోసం ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అని అనడంలో సందేహం లేదు.
ఇక నగరంలోని ప్రసాద్ ఐ మాక్స్ వద్ద సినిమా రిలీజ్ అప్పుడు ఇంకాస్త ఎక్కువ హడావిడి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఒక యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి.. ఓ మైక్ పట్టుకుని సినిమా చూసిన ప్రేక్షకులను ఆపి ఒపీనియన్ చెప్పమంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ రివ్యులకు బ్రేక్ పడనుందని తెలుస్తుంది. ఇకపై మల్టీప్లెక్స్ ఆవరణలో ఇలాంటి యాక్టివిటీస్‌పై నిషేధం విధిస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓ పెద్ద సినిమా విడుదల రోజున జరిగిన సంఘటనే అందుకు కారణమని భావిస్తున్నారు.
ఇక ఛానల్స్ లో కనిపించి పబ్లిసిటీ పొందవచ్చు అనే అభిప్రాయంతో కొందరు అదే పనిగా పెట్టుకుంటున్నారు. రివ్యూలు అంటే వీళ్ళే చెప్పాలి అనేంత బిల్డప్ లు ఇవ్వడం ఒక ఎత్తైతే.. వారు మూవీ విశ్లేషణ గురించి చెప్పడం చూస్తే రాజమౌళికి కూడా డైరెక్షన్ నేర్పిస్తారేమో అని అనిపిస్తుంది. అయితే ఒక రకంగా ఈ నిర్ణయం మంచిదే అని.. వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించే సినిమాపై రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు అని అంటున్నారు.
వాళ్ళందరిని చూసి కొందరు పనికిమాలిన వాళ్ళ కోసం మరికొందరు పనికిమాలిన వాళ్ళు తోడు అవ్వడం ఈ మధ్య పరిపాటిగా మారిందని సదరు సినిమా అభిమాని అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో ఎప్పుడూ తప్పులేదు. కానీ వ్యక్తపరిచే పద్దతి ఎలా ఉంది అనేది ముఖ్యం. వాళ్ళు ఏదో పిచ్చిగా చేస్తూ చెప్పడం .. అలా చేసిన వారిని కొందరు పని గట్టుకొని మీమ్స్, వీడియో లతో హైప్ చేయడం వాళ్ళు ఫేమస్ అవ్వడం కూడా చూడవచ్చు. వారిని చూసి ఇప్పుడు అదే రీతిలో మరికొందరు ఇదే పనిగా చేయడం చూస్తే.. వాళ్ళ గురించి ఏం రాయాలో తెలియడం లేదు. సినిమాని సినిమాలాగా చూడండి.. మీ పబ్లిసిటీ కోసం.. మీ పిచ్చి రివ్యూలతో స్టేట్ మెంట్లు ఇచ్చేసి ప్రేక్షకులకు సినిమా మీద ఉన్న అభిప్రాయాన్ని మాత్రం పోగొట్టకండి అని కొందరు కోరుకుంటున్నారు.