Site icon Prime9

Avatar 2 (The Way Of Water ) : భారత్ లో అవెంజర్స్ ని దాటేసిన అవతార్ 2 .. రికార్డు కలెక్షన్స్

avatar 2 (the way of water) crosses avengers end game collections

avatar 2 (the way of water) crosses avengers end game collections

Avatar 2 (The Way Of Water ): హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ “అవతార్ – ది వే ఆఫ్ వాటర్”.

ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అంతా ఈ మూవీ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే.

హాలీవుడ్‌లో తెరకెక్కిన అవతార్-2 మూవీని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు.

2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాకు ఇండియాలోనూ అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

దీంతో ఈ సినిమా రిలీజ్ రోజునే కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టినట్లుగా చిత్ర వర్గాలు వెల్లడించాయి.

డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు భారత్‌లో ఇంకా ప్రేక్షకాదరణ లభిస్తూనే ఉంది.

ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా తనదైన సత్తా చాటుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

అవతార్ 2 మూవీ ఇప్పటివరకు ఏకంగా రూ.368.20 కోట్ల వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది.

అవెంజర్స్ ని బీట్ చేసిన అవతార్ 2 Avatar 2 (The Way Of Water )..

గతంలో హాలీవుడ్ సూపర్ హీరో మూవీ అవెంజర్స్ ఎండ్‌గేమ్ రూ.367 కోట్ల వసూళ్లతో టాప్ స్థానంలో నిలవగా, ఇప్పుడు దాన్ని అవతార్-2 క్రాస్ చేసింది.

జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ టోటల్ రన్‌లో ఎంతమేర కలెక్షన్లు రాబడుతుందా అని ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

ఏదేమైనా అవతార్-2 తన రికార్డుల వేటను ఇంకా కొనసాగిస్తుండటం విశేషమని చెప్పాలి.

ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

ఈ చిత్రాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చడంతో ఈ సినిమా తొలిరోజే అదిరిపోయే వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అవతార్-2 మొదటి రోజున ఏకంగా రూ.14 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది.

ఒక హాలీవుడ్ మూవీ ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం సరికొత్త రికార్డని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

గతంలో ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజున కేవలం రూ.5.4 కోట్లు మాత్రమే.

ఈ సినిమాపై బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ.16,400 కోట్లు ఆదాయం రావాలని జేమ్స్ కామెరూన్ ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న టాక్ ని చూస్తే కొద్ది రోజుల్లోనే ఆ టార్గెట్ చేరుకుంటుంది అని చెప్పవచ్చు.

 

 

జేమ్స్ కామెరూన్ ని కలిసిన జక్కన్న..

ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జేమ్స్‌ కామెరూన్‌ను రాజమౌళి కలిశారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు.

ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ఇందులోని పలు సీన్లను కామెరూన్‌ వివరణాత్మకంగా జక్కన్నకు చెప్పారు.

ఈ చిత్రాన్ని కామెరూన్‌ రెండుసార్లు చూసినట్లు ఆయన సతీమణి సుజీ కామెరూన్‌ వెల్లడించారు.

వీరిద్దరి మాటలతో రాజమౌళి అమితానందం పొందారు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version