Site icon Prime9

Avatar 2 OTT Release Date: అవతార్ 2 మూవీ అద్దె తెలిస్తే షాక్ అవాల్సిందే..

Avatar 2 OTT Release Date

Avatar 2 OTT Release Date

Avatar 2 OTT Release Date: హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ ‘అవతార్ 2’(అవతార్‌-ది వే ఆఫ్ వాటర్). గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2009 లో పండోరా గ్రహంపై అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ..13 ఏళ్ల తర్వాత అవతార్ 2 ను తెరకెక్కించారు. ఈ మూవీలో సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ప్రేక్షకులకు తెలియ జేశారు.

అయితే, ఇన్నాళ్లు థియేటర్‌ ఆడియన్స్‌ అలరించిన ఈ చిత్రం.. ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. కేవలం ఒకే ఓటీటీ వేదికపై కాకుండా పలు వేదికల్లో ‘అవతార్2’ స్ట్రీమింగ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అవతార్‌ టీమ్‌ వెల్లడించింది.

పలు వేదికలపై స్ట్రీమింగ్(Avatar 2 OTT Release Date)

మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో ‘అవతార్2’ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, తొలుత ఈ మూవీని రెంట్ ద్వారా అందుబాటులో తెస్తున్నారు. ఈ సినిమా చూడాలనుకునేవారు ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు. డిస్నీ మూవీస్‌ ఇన్‌సైడర్స్‌ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాలను ఉంచారు. అయితే అవతార్ 2 మూవీ అద్దె తెలిస్తే మాత్రం అవాక్స్ అవాల్సిందే.

దాదాపు 19.99 అమెరికన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 1,600. మార్చి 28 వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ‘అవతార్2’ వీక్షించొచ్చు. ఒకసారి మూవీని ప్రీఆర్డర్‌ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్‌ చేసుకునే వీలుంది. కానీ యూకే, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఉండేవారికి 14 రోజుల వెసులుబాటు కల్పించారు. అయితే, సినిమా చూడటం, డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత క్యాన్సిల్‌ చేయడం కుదరదు. ‘అవతార్‌2’ 4కె అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ అట్‌మాస్‌ ఆడియోతో రానుంది. ఈ చిత్రానికి కొనసాగింపు ‘అవతార్3’ కూడా రానుంది. ‘అవతార్‌: ది సీడ్‌ బారియర్‌’ పేరుతో రానున్న ఈ మూవీ డిసెంబరు 20, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Exit mobile version