Site icon Prime9

Ramnagar Bunny Bunny OTT: 3 నెలల తర్వాత ఓటీటీకి వస్తున్న యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Ramnagar Bunny OTT Streaming and Release Date: బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ. గతేడాది అక్టోబర్ లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. సినిమా విడుదలై మూడు నెలలు అవుతుంది. కానీ, ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది.

కాగా శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో స్వయంగా ప్రభాకర్ నిర్మించారు. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబివకా వాని, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించింది. జనవరి 17 న రామ్ నగర్ బన్నీని ఆహాలో విడుదల చేస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది సదరు సంస్థ.

కాగా విడుదలకు ముందు బుల్లితెర హీరో ప్రభాకర్ తన కొడుకు సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు. సినిమా రివ్యూ చూసే థియేటర్ కు రండి అని కాన్పిడెంట్ చూపించాడు. ఇక ప్రమోషనల్ కార్యక్రమంలో చంద్రహాస్ తీరుపై ఫుల ట్రోలింగ్ జరిగింది. అతడి మాట, తీరు చూసి నెటిజన్లు తెగ మండిపడ్డారు. తెగ యాటిట్యూడ్ చూపించాడంటూ విమర్శలు గుప్పించారు. సినిమా రిలీజ్ కు ముందు ట్రోలింగ్ తో చంద్రహాస్ లైమ్ లైట్లో నిలిచాడు. అతడిపై వచ్చి ట్రోలింగ్ అదే సినిమాకు ప్రమోషన్ కూడా అయ్యింది. అలా గతేడాది అక్టోబర్ లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ మెప్పించలేకపోయింది.

చంద్రహాస్ నటన, డ్యాన్స్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ కథనం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే టైంలో దేవర థియేటర్ లో రన్ అవుతుండటంతో సినిమా ఎక్కువ రోజులు థియేటర్లో నిలవలేకపోయింది. పెద్దగా టాక్ లేకపోవడంతో కొద్ది రోజులకే మూవీ థియేటర్ నుంచి బయటకు వచ్చింది. అయితే హిట్ సినిమాలే నెల రోజులకు ఓటీటీకి వస్తుండటంతో రామ్ నగర్ బన్నీ లాంటి ప్లాప్ సినిమా డిజిటల్ వేదికపై రావడానికి మూడు నెలల టైం పట్టడం గమనార్హం. ఏదేమైన ఎట్టకేలకు ఈ యాటిట్యూడ్ స్టార్ సినిమా ఓటీటీ రిలీజ్ ను ఫిక్స్ చేసుకుంది. థియేటర్లో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version