Site icon Prime9

Dasara Movie : దసరా మూవీ కోసం 22 ఎకరాల్లో ఊరి సెట్ – ఆర్ట్ డైరెక్టర్ అవినాష్

art director avinash interesting words about dasara movie

art director avinash interesting words about dasara movie

Dasara Movie : నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి సారి నాని పూర్తి మాస్ లుక్ లో కనపడుతుండటం, ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ అదరగొట్టేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కంటెంట్ బాగుండటం, నాని లుక్​తో సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా దసరా సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో సినిమా యూనిట్ అంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా దసరా సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన అవినాష్ కొల్లా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలని తెలిపాడు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గతంలో నానికి చాలా సినిమాలకు పని చేశాడు. ఇప్పుడు దసరా సినిమాకు మరోసారి నానితో కలిసి పనిచేశాడు. ఈ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నాని ఎక్కువగా కథ ఉన్న సినిమాలే చేస్తాడు. వాటిల్లో మాకు కూడా ఎక్కువ పని ఉంటుంది. నానితో ఎప్పట్నుంచో ట్రావెల్ చేస్తున్నా. దసరా సినిమాకు నాని నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. దసరా సినిమా తెలంగాణ బొగ్గు గనులకు దగ్గర్లో ఉన్న ఓ పల్లెటూళ్ళో జరిగే కథ. అందులోను 25 ఏళ్ళ క్రితం జరిగే కథ. అలాంటి ఊరిని వెదికి అక్కడ షూట్ కష్టం అనిపించి సెట్ వేశాం.

విద్యుత్ శాఖ వాళ్ళు కూడా షాక్ అయ్యారు (Dasara Movie)..

హైదరాబాద్ బాచుపల్లి దగ్గర్లో ఉన్న అడవి దగ్గర 22 ఎకరాల్లో ఊరి సెట్ వేశాం. ఇందుకు తెలంగాణ బొగ్గు గనులు ఉన్న ఊర్లు అన్ని బాగా గమనించాము. ఊరంతా బొగ్గు, దుమ్ము ఉండేలా అన్నిట్లో పక్కాగా జాగ్రత్తలు తీసుకొని డిజైన్ చేశాము. షూటింగ్ లో కూడా చాలా మంది సినిమా వాళ్లే అది నిజమైన ఊరు అనుకున్నారు. సెట్ లో ఉన్న కరెంట్ స్థంబాలు, వైర్లు చూసి విద్యుత్ శాఖ వాళ్ళు వచ్చి ఇది నిజంగా వేసారేమో అని అడిగారు వాళ్లకు సెట్, సినిమా షూట్ అని చెప్పాల్సి వచ్చింది. అంత న్యాచురల్ గా ఊరిని నిర్మించాం. ఇందుకు బాగానే ఖర్చయింది. సినిమాలో ఎక్కడా కూడా ఊరిని కట్టినట్టు అనిపించదు, నిజంగా ఓ తెలంగాణ బొగ్గు గనుల పల్లెటూరులాగానే అనిపిస్తుంది అని తెలిపారు.

ఇప్పటిదాకా ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూసి ఇది నిజంగానే ఏదైనా ఊరిలో చేశారేమో షూటింగ్ అని అంతా అనుకున్నారు. కానీ ఏకంగా 22 ఎకరాల్లో ఇంత పెద్ద సెట్ వేశారని చెప్పడంతో అది నిజమైన ఊరు కాదా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంత అద్భుతంగా నిర్మించిన ఆర్ట్ వర్క్ చూసి అవినాష్ కొల్లాని అందరూ అభినందిస్తున్నారు. ఇక ఈ ఊరి సెట్ కి దాదాపు 10 కోట్లకు పైనే ఖర్చు అయిందని సమాచారం.

Exit mobile version