Site icon Prime9

Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మకు మరో షాక్‌ – మరోసారి నోటీసులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Legal Notice to Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు మరోసారి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆర్జీవీ దర్శకత్వంతో తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా వ్యవహరంలో చిత్ర బ్రందంతో పాటు వర్మకు, ఫైబర్ నెట్‌ మాజీ ఎండీకి కూడా ప్రభుత్వం లీగల్‌ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు.. ఫైబర్‌ నెట్టి నుంచి రూ. 1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందారని ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తెలిపారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ వ్యూహం సినిమా రిలీజ్‌ చేసిన సంగత తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి రూ. 2.15 కోట్లకు ఫైబర్‌ నెట్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్నట్టు తాజాగా ఏపీ ఫైబర్‌ నెట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ వెల్లడించారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఈ ఒప్పందం జరిగిందని, అయితే వ్యూహం సినిమాకు వ్యూస్ తక్కువే ఉన్న కోటీ రూపాయలపైనే చెల్లించారట. అప్పటి ఒప్పందం ప్రకారం ఒక్కొ వ్యూకి రూ. 100 మాత్రమే చెల్లించాలి. అయితే వ్యూహం సినిమాకు 1863 వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. దానికి ఫైబర్‌ నెట్‌ సినిమాకు రూ. 1.15 కోట్లు చెల్లించింది. అంటే గత ప్రభుత్వం ఆయనకు ఒక్కో వ్యూకి 11 వేల రూపాయలు చెల్లించిందని ఆయన తెలిపారు.

నిబంధనలకు విరద్ధంగా ప్రభుత్వం నుంచి వ్యూహం టీం నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి ఆదేశం మేరకు తాజాగా ఆర్జీవీ, ఫైబర్‌ నెట్‌ మాజీ ఎండీతో పాటు మూవీ టీంకి తాజాగా లీగల్ నోటీసులు జారీ చేశారు. ఒక్కో వ్యూకు వంద చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, రూల్స్‌కి విరుద్ధంగా వ్యూస్ లేకపోయిన ఫైబర్‌ నెట్ నుంచి కోటికి పైడా అనుచిత లబ్ధి పొందినట్టు నోటీసులో ఇస్తూ 15 రోజుల్లోపు లబ్దిపొందిన డబ్బుని వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని ఆదేశించారు. అదే విధంగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చినట్టు జీవీ రెడ్డి వెల్లడించారు.

మరి ఫైబర్‌ నెట్‌ ఆరోపణలు, నోటీసులపై రాంగోపాల్ వర్మ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. కాగా కొన్ని రోజుల క్రితమే ఈ విషయంపై ఆరోపణలు రాగా, కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన మొదలు పెట్టినట్టుగా కనిపిస్తోంది. చెప్పిన సమయంలో ఒక వడ్డీతో సహా చెల్లించకపోతే ఆర్జీవి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మపై ఏపీలో వరుస కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విటర్‌లో పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్లు వర్మపై కేసులు నమోదు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పటిషన్‌ వేసి అరెస్ట్‌ నుంచి తప్పించుకున్నాడు.

Exit mobile version