Anushka Sharma: బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. తొలిసారి కేన్స్ రెడ్ కార్పెట్‌పై అనుష్క తళుక్కుమంది. అనుష్క కేన్స్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె లుక్ పై భర్త విరాట్ కోహ్లీ హార్ట్ ఎమోజీతో రెస్పాండ్ అయ్యాడు. కాగా, కేన్స్ లో అనుష్క శర్మ రిచర్డ్ క్విన్ డిజైన్ చేసిన క్రీమ్ కలర్ హాఫ్ షోల్డర్ గౌను తో అట్రాక్ట్ చేసింది.
ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క నటనకు గుడ్ బై చెబుతుందనే టాక్ నడుస్తోంది. నటనతో పాటు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు అనుష్క ఇటీవల చెప్పింది. ఇక, అనుష్క ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు సమాచారం.