Site icon Prime9

Anasuya Bharadwaj: మా ఫ్యామిలీలోనూ ‘గే’లు ఉన్నారు: యాంకర్ అనసూయ వైరల్ కామెంట్స్

Ansuya Bharadwaj

Ansuya Bharadwaj

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరి తెలుసు. తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్తూ ఉంటుంది.

నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు చాలా ధైర్యంగా సమాధానాలు ఇస్తుంటారు. తాజా అనుసూయ నెటిజన్స్ తో క్శశ్చన్ అవర్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

అలాంటి లేనపుడు యాంకరింగ్ చేస్తా(Anasuya Bharadwaj)

ఆన్ లైన్ చాటింగ్ లో భాగంగా ఓ అభిమాని ఆమెను ‘ మీరు లిబరల్, మెచ్యూర్డ్ ఉమెన్ అయితే ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలి’ అని అడిగారు. ‘మీకు ఎపుడైనా లెస్బియన్స్ తో అనుభవం ఉందా’ అని అడిగ్గా.. దానికి అనసూయ ఇచ్చిన సమాధానం ఇపుడు వైరల్ గా మారింది.

మా ఫ్యామిలీలో , ఫ్రెండ్స్ లో ‘గే’ లు ఉన్నారని .. అయితే పర్సనల్ గా ఇటువంటి అనుభవాలు ఎదురు కాలేదు కానీ ఆన్ లైన్ లో ఎదురయ్యాయి’ అని అనుసూయ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

ఇపుడు అనసూయ చేసని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జనరల్ గా నెటిజన్స్ అడిగే పలు ఇబ్బందికర ప్రశ్నలకు సెలబ్రెటీలు సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తారు. కానీ అనసూయ మాత్రం డాషింగ్ సమాధానాలు ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.

‘ మళ్లీ యాంకరింగ్ ఎప్పుడు చేస్తారు ’ అని మరో ప్రశ్న అడగ్గా.. దానికి అనసూయ ‘ టీఆర్పీ కోసం మేకర్స్ అవమానకరమైన స్టంట్స్ చేస్తున్నారు. అలాంటి లేనపుడు యాంకరింగ్ చేస్తాను.. యాంకరింగ్ ను నేను కూడా మిస్ అవుతున్నా’ అని చెప్పింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అనసూయ. ఈ మధ్య ‘మైఖేల్’లో కనిపించారు. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’లో మంచి రోల్ చేస్తుండగా.. ‘రంగమార్తాండ’ షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ మూవీ విడుదల సిద్దమైంది.

Exit mobile version