Site icon Prime9

janhvi kapoor: ట్రోలర్లకు జాన్వీకపూర్ కౌంటర్ ..

janhvi kapoor

janhvi kapoor

janhvi kapoor: శ్రీదేవి.. బోనీకపూర్‌ ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నఆమె చిత్రం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మే 31న విడుదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఆమె భుజానికి గాయమై బ్యాండేజితో కనిపించింది.

ఆ వీడియోలను జాన్వీ ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతాలో విడుదల చేసింది. తనకు గాయాలైనా లెక్కచేయకుండా చిత్తశుద్ధితో ఆమె క్రికెట్‌ ప్రాక్టీస్‌చేశాననే సందేశం ఇవ్వదలచుకున్నారేమో. ఆమె విడుదల చేసిన వీడియోలో చిన్న టెన్నిస్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు. ఇది కాస్తా నెటిజన్ల కంటపడి ఆమెను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. టెన్నిస్‌బాల్‌తో క్రికెట్‌ ఆడితే భుజానికి గాయం ఎలా అవుతుందమ్మా అంటూ ఎగతాళి చేస్తూ పోస్ట్‌ పెట్టడం మొదలుపెట్టారు.

వీడియోను చూడండి..(janhvi kapoor)

పెద్ద ఎత్తున ట్రోల్స్‌ రావడంతో ఓపిక నశించిన జాన్వీ కపూర్‌ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. క్రికెట్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేసినప్పుడే గాయమైందని, గాయం తర్వాత టెన్నిస్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేయాల్సి వచ్చిందని … బ్యాండేజీని చూస్తే మీకు అర్ధం అవుతుందని జాన్వీ వివరణ ఇచ్చుకున్నారు. తనను ఎగతాళి చేసే ముందు వీడియోను ఒక్కసారి గమనించిన తర్వాత కామెంట్‌ చేస్తే తాను కూడా నవ్వుకునేదాన్ని కదా అంటూ ట్రోలర్స్‌ గట్టిగా సమాధానం ఇచ్చారు.

ఇక శరణ్‌ శర్మ చిత్రం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ లవ్‌స్టోర్‌ విషయానికి వస్తే పెళ్లైన జంట మహేంద్ర అగర్వాల్‌, మహిమా అగర్వాల్‌ ఇద్దరికి క్రికెట్‌ అంటే ఎనలేని అభిమానం… పిచ్చి. ఆ ఇతివృత్తంతో సినిమా తీశారు. బాక్స్‌ ఆఫీస్‌ వద్ద మొదటి రోజు రూ.6 నుంచి 8 కోట్లు కలెక్షన్‌ వసూలు చేసి అవకాశం ఉంది. ఈ వారంతంలో రూ.20 కోట్ల వరకు వసూలవుతుందని సినీపండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్‌ రావు, జాన్వీకపూర్‌తో పాటు కుముద్‌ మిశ్రా, రాజేశ్‌ శర్మ, జరీనా వాహెబ్‌, అర్జిత్‌ తనేజ్‌, యామిని దాస్‌ కీలకపాత్రలు పోషించారు.

 

Exit mobile version
Skip to toolbar