Site icon Prime9

Anchor Anasuya : కాంతార హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ అనసూయ ..!

anchor-anasuya-shocking-comments-about-kantara-movie

anchor-anasuya-shocking-comments-about-kantara-movie

Tollywood News: యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో లో యాంకర్ గా రాణించి భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. బుల్లితెరపై పలు ప్రోగ్రామ్ లకు హోస్ట్ గా చేస్తూనే… వెండితెరపై కూడా తన టాలెంట్ చూపిస్తుంది. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె… పుష్ప2, గాడ్ ఫాదర్ సినిమాలతో మరింత క్రేజ్ పెంచుకుంది.

సినిమాలు, యాంకరింగ్ ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది అనసూయ. తాజాగా తన ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించింది యాంకర్ అనసూయ. అందులో అభిమానులకు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ మేరకు ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కాంతార మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ సినిమాలో రిషబ్ శెట్టి తన అద్బుతమైన నటనతో అందరినీ మైమరపించారని… ఆ సినిమా ప్రభావం వెంటనే బయట పడలేక పోయానంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఇక రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక, కేరళ ఆదివాసీల సంప్రదాయం పై తెరకెక్కిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి గ్రాండ్ విక్టరీని అందుకుంది. ముఖ్యంగా ఇందులో రిషబ్ శెట్టి నటనకు అందరూ ఫిదా అయ్యారు.

Exit mobile version