Site icon Prime9

Amitabh Bachchan : పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” చూస్తూ అమితాబ్ ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

amitabh bachchan serious reaction while watching tholi prema movie

amitabh bachchan serious reaction while watching tholi prema movie

Amitabh Bachchan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ లలో “తొలిప్రేమ” కూడా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 1998లో రిలీజైన ఈ మూవీ ప‌లు అవార్డుల‌తో పాటు రివార్డుల‌ను అందుకున్న‌ది. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాకు దేవా సంగీతాన్ని అందించగా.. పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఫుల్ గా మెప్పించాయి. 1998 ఏడాదికి గాను బెస్ట్ తెలుగు మూవీగా తొలి ప్రేమ నేష‌న‌ల్ అవార్డును అందుకున్న‌ది. ఆరు నంది అవార్డుల‌ను ద‌క్కించుకొంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకి ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు.

రీసెంట్ గా ఈ సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ ఈ చిత్రాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ థియేటర్స్ దద్దరిల్లిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పై అప్పట్లో ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కాగా ఈ సినిమాపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా ప్రశంసలు కురిపించారని తాజాగా బయటికొచ్చింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. తొలి ప్రేమ సినిమా ను బిగ్ బి చూశారని.. ఆయన క్లైమాక్స్ చూసి మెచ్చుకున్నారని తెలిపాడు. తొలిప్రేమ సినిమా చూసేటప్పుడు సినిమా మొత్తం ఆయన ఎంతో ఎంజాయ్ చేశారని.. కానీ ఆ ఒక్కసారి బాగా సీరియస్ అయ్యారని చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే అసలు విషయం ఏంటంటే.. సినిమాలో క్లైమాక్స్ రాగానే హీరోయిన్ వెళ్లిపోయేటప్పుడు కారు తాళాలు స్క్రీన్ మీద విసిరేసి సీరియస్ అయ్యారట అమితాబ్. హీరోయిన్ అలా వెళ్లిపోయిందేంటీ.. దర్శకుడు ఇలా తెరకెక్కించదేంటి అంటూ ఫీల్ అయ్యారట. అంతలో జయాబచ్చన్ కొంచెం సేపు ఆగండి అని చెప్పారట. ఇక చివరిలో హీరోయిన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె చప్పట్లు కొట్టారట. అప్పుడు అమితాబ్ వా ఏం సినిమా ఇది క్లాసిక్ అని అన్నారట. ఆయన అంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారని.. ఆ విషయాన్ని చెన్నై వచ్చిన సమయంలో తనతో చెప్పారని కరుణాకరన్ అన్నారు. ప్రస్తుతం ఈ విషయం ట్రెండింగ్ గా మారింది.

Exit mobile version