Amitabh Bachchan: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుపుకుంటోంది. ఈ క్రమంలో బిగ్ బీ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రికరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అమితాబ్ కు దెబ్బలు తగిలాయి.
ఏఐజీలో చికిత్స
దీంతో హుటాహటిన ఆయన్ను గచ్చిబౌలి లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి తరలించారు. ఈ ప్రమాదంలో అమితాబ్(Amitabh Bachchan) పక్కటెముకలు విరిగినట్టు వైద్యులు గుర్తించారు.
అందుకు సంబంధించి చికిత్స అందించిన డాక్టర్లు.. ఆయనకు రెండు వారాల పాటు బెస్ట్ రెస్ట్ అవసరమని సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బి తన బ్లాగ్ లో వెల్లడించారు.
నాలుగు రోజుల పాటు ఏఐజీలో చికిత్స తీసుకుని ముంబై వెళ్లినట్టు ఆయన చెప్పారు.
ఊపిరీ తీసుకున్నపుడు ఇబ్బందిగా ఉండటంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని.. అందువల్ల పనులన్నింటినీ వాయిదా వేసుకున్నట్టు ఆయన తెలిపారు.
అభిమానులు ఆందోళన పడొద్దు(Amitabh Bachchan)
తాను పాల్గొనాల్సిన షూట్స్ కి కూడా బ్రేక్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి వీకెండ్ లాగా.. ఈ వీకెండ్ అభిమానులను కలవలేకపోతున్నానని వెల్లడించారు.
అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. పూర్తిగా కోలుకుని త్వరలోనే అందరినీ కలుస్తానన్నారు.
కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది.
భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో దీపికా పడుకొనే హీరోయిన్.