Site icon Prime9

Mirzapur: సినిమాగా వస్తున్న మోస్ట్‌ పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్’ – స్పెషల్‌ వీడియో అమెజాన్‌ సర్‌ప్రైజ్‌

Mirzapur Film

Mirzapur The Film Confirmed: ఓటీటీలో బాగా పాపులరైన వెబ్‌ సిరీస్‌ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ‘మీర్జాపూర్‌’. మెజాన్‌ ప్రైంలో భారీ వ్యూస్‌ అందుకున్న ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌లో ఇది ఒకటి. మూడు సీజన్లుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘సీజన్‌, సీజన్‌కు రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల విడుదలైన మూడో సీజన్‌ కూడా అమెజాన్‌లో ఆల్‌ టైం రికార్డు వ్యూస్‌ సాధించింది. ఓటీటీలో విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు సినిమాగా రాబోతుంది. ఈ సీరిస్‌ ఉన్న క్రేజ్‌ దృష్ట్యా దీన్ని సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నట్టు తాజాగా స్పెషల్‌ వీడియో ప్రకటన ఇచ్చింది మూవీ టీం.

‘మీర్జాపూర్‌ : ది ఫిల్మ్‌’ పేరుతో థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లో ప్రధాన పాత్రలతో వీడియో విడుదల చేశారు. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫైజల్‌, అభిషేక్‌ బెనర్జీ, దివ్వెందులతో ఈ స్పెషల్‌ వీడియోతో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది అమెజాన్‌ ప్రైం. అంతేకాదు ఈ సినిమాకు 2026లో థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు స్పష్టం చేసింది. గుర్మిత్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు పూనిత్ కృష్ణ కథ అందిస్తున్నారు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రితేష్‌ సిద్భవాని, కాసిమ్ జాక్‌మార్కింగ్, ఫర్హాన్‌ అక్తర్‌, విశాల్‌ రసందనిడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మీర్జాపూర్ తొలి సీజన్ 2018 నవంబర్ అమెజాన్‌లో విడుదల కాగా దీనికి ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. అమెజాన్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించిన తొలి ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ నిలిచింది. ఇక ఆ తర్వాత 2020లో వచ్చిన సెకండ్‌ సీజన్‌ విశేష ఆదరణ పొందింది. ఫస్ట్‌ సీజన్‌ కంటే సెకండ్‌ సీజన్‌ భారీ వ్యూస్‌ అందుకుంది. దీంతో మూడో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడో సీజన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆడియన్స్‌ ఇది కాస్తా నిరాశ పరిచింది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన మూడో సీజన్‌ ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ వ్యూస్‌తో మాత్రం ఓటీటీలో దుమ్మురేపింది. ఇక ఇప్పుడు సినిమాగా వస్తున్న మీర్జాపూర్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అదే థీమ్‌, అవే క్యారెక్టర్లతో వస్తున్నప్పటికీ కథ మాత్రం కొత్తగా ఉంటుందంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడియన్స్‌న అలరిస్తుందో చూడాలి!

Exit mobile version