Site icon Prime9

Allu Sirish : నేనె ముందు బ్రేకప్ చెప్పి నేనె బాధ పడ్డానంటున్న… అల్లు శిరీష్

allu sirish prime9news

allu sirish prime9news

Allu Sirish : తెలుగు సినిమా పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఈ కుటుంబం నుంచి నిర్మాతగా అల్లు అరవింద్ తెలుగు సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఈయన వారసులుగా అల్లు బాబి కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకి తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఇద్దరూ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకోగా అల్లు శిరీష్ కు మాత్రం సిని పరిశ్రమలో సరైన గుర్తింపు ఇప్పటికి పొందలేకపోయారు.

అల్లు శిరీష, అను ఇమ్మానుయేల్ జంటగా కలిసి నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా నవంబర్ 4 నా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఓ వైపు నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్ సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని బయటికి వెల్లడించారు.

ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా అని అడగగా.. అవును రిలేషన్లో ఉన్నానని ఐతే కొన్ని కారణాల వల్ల వాళ్ళకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఎంతో బాధపడ్డానని, బ్రేకప్ చెప్పినప్పటికీ మనం మాత్రమే కాకుండా అటు వైపు వారు కూడా బాధ పడ్డారని ఆయన వెల్లడించారు. తాను అనవసరంగా బ్రేకప్ చెప్పి సమయాన్ని వృధా చేసుకున్నానని లేకపోతే ఈ పాటికి తనకి పెళ్లి కూడా జరిగి ఉండేదని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.ఐతే తాను ఎవరితో రిలేషన్ లో ఉన్నారో వారి పేర్లు మాత్రం బయట వెల్లడించలేదు.

Exit mobile version