Site icon Prime9

Mangalavaaram : పాయల్ ” మంగళవారం “మూవీ ప్రీ రిలీస్ ఈవెంట్ లో పుష్ప హీరో అల్లు అర్జున్ ..

allu-arjun-comes-for-mangalavaaram-movie-pre release-event

allu-arjun-comes-for-mangalavaaram-movie-pre release-event

Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.. రెండో సినిమా ‘మహాసముద్రం’తో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. శర్వానంద్, సిద్దార్ద్ లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ మిగిలించింది. అయితే ఇప్పుడు మూడో సినిమాగా ‘మంగళవారం’ అనే ఒక డిఫరెంట్ కథతో వస్తున్నాడు. పాయల్ రాజ్‌పుత్ ని ముఖ్య పాత్రలో పెట్టి అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక వచ్చే వారం రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈక్రమంలోనే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ని తీసుకు వస్తున్నారు. నవంబర్ 11న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అల్లు అర్జున్ రాకతో ఈ సినిమా రిలీజ్ పై మరింత బజ్ క్రియేట్ అవుతుంది. నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

 

ఇక సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఓ బోల్డ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘శైలు.. చాలాకాలం మీ గుండెల్లో ఉండిపోతుంది’’ అని అజయ్ ట్వీట్ చేశారు. అర్ధనగ్నంగా ఉన్న పాయల్‌ రాజ్‌పుత్‌ పోస్టర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పోస్టర్‌లో పాయల్‌ వేలిపై సీతాకోకచిలుక, కంట్లో నీళ్లు కనిపించాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ని గమనిస్తే ఈ చిత్రంలో పాయల్ శైలజ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ చాలా వైరల్ గా ఉంటుందట. ఒకవేళ సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా యూత్ క్యూ కట్టేస్తారు అని ఇండస్ట్రీ వ్యక్తులు చెబుతున్నారు. రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ టీజర్స్ లోనే పాయల్ క్యారెక్టర్ యూత్ ని థ్రిల్ చేసేలా కనిపించింది. స్వాతి గునుపాటి, ఎం సురేష్ వర్మ, అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. అయితే  ‘మహాసముద్రం’ సినిమాలా ఇది మిస్ ఫైర్ అవ్వదని, ఇది అందర్నీ థ్రిల్ చేసే కథని, కచ్చితంగా హిట్టు అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు.

Exit mobile version