Site icon Prime9

Allu Aravind: ‘గేమ్‌ ఛేంజర్‌’పై అల్లు అరవింద్‌ సెటైర్లు? – మెగా ఫ్యాన్స్‌ అసహనం

Allu Aravind Satirical Comment on Game Changer:’తండేల్‌’ ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్ మండిపతున్నారు. ఇప్పటికే గేమ్‌ ఛేంజర్‌ రిజల్ట్‌పై బాధలో ఉన్న అభిమానులను అల్లు అరవింద్‌ కామెంట్స్‌ మరింత బాధిస్తున్నాయంటున్నారు. ఇంతకి ఏమైందంటే.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ తండేల్‌ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తండేల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందీప్‌ రెడ్డి వంగాతో పాటు నిర్మాత దిల్‌ రాజు కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేజ్‌పై దిల్‌ రాజు, అల్లు అరవింద్‌ ఒకేసారి మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ దిల్‌ రాజును ఉద్దేశిస్తూ.. “ఈ మధ్య దిల్‌ రాజు ఒక చరిత్ర సృష్టించాడు. ఒక సినిమాను పడుకొబెట్టి, మరో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి. ఆ తర్వాత ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ని ఆహ్వానించి.. ఒక వారంలో రకరకాలు చేశాడు” అంటూ కామెంట్‌ చేశాడు.

ఆయన తీరును నెటిజన్స్‌, మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు మాత్రం ఆ తీరుపై గుర్రుగా ఉన్నారు. కావాలనే ఇలాంటి కామెంట్స్‌ చేశాడని, ఒక సినిమాను పడుకోబెట్టాడు అంటూ గేమ్‌ ఛేంజర్‌ మూవీని కించపరించాడంటున్నారు. పైగా ఆయన నవ్వుతూ చేసిన ఈ కామెంట్స్‌ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌పై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా మెగా అభిమానుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

Exit mobile version