Site icon Prime9

Allu Aravind: ఇంటిపై రాళ్ల దాడి – స్పందించిన అల్లు అరవింద్‌

Allu Aravindh Reaction on Attack: తన నివాసంపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ప్రముఖ నిర్మాత, సినీ హీరో అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను మీరందరూ చూశారు. ప్రస్తుతం ఈ అంశంపై సంయనం పాటిస్తున్నామన్నారు. ఇంటి బయట ఎవరు గొడవ చేసిన పోలీసులు వారిని తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి.

ఇప్పటికే మా ఇంటి ముందు గొడచ చేసిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై మేము ఎలాంటి కామెంట్స్‌ చేయాలి అనుకోవడం. ప్రస్తుతం మేం సంయనం పాటించాల్సిన సమయం” అని అన్నారు. కాగా ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్‌ ఇంటి ముందు ఓయూ జేఏసీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ వల్లే రేవతి చనిపోయిందని, తక్షణమే వారి కుటుంబానికి కోటీ రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కొందరు అత్యూత్సాహం ప్రదర్శిస్తూ ఆయన ఇంటిపై రాళ్లు విసరగా ఆవరణంలోని పూల కుండిలు ధ్వంసం అయ్యాయి.

Exit mobile version