Site icon Prime9

Allu Aravind:అల్లు అర్జున్‌కి అనారోగ్యం – అందుకే తండేల్‌ ఈవెంట్‌కు రాలేదు: అల్లు అరవింద్‌

Allu Aravind on Allu Arjun Health: నాగచైతన, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించి తండేల్‌ మూవీ ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్‌ వస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది.

దీంతో బన్నీ ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే చివరి నిమిషంలో అల్లు అర్జున్‌ రాకపోవడంతో ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా వచ్చారు. అధికారిక ప్రకటన ఉన్నప్పటికీ అల్లు అర్జున్‌ ఎందుకు రాలేదని అందరిలో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్‌ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణాలను తాజాగా అల్లు అరవింద్‌ వెల్లడించారు. తండేల్‌ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మూవీ ఈవెంట్‌కి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు ముందుగా చెప్పాం. కానీ, ఈ కార్యక్రమానికి అతడు హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగానే బన్నీ ఈవెంట్‌కి రాలేకపోయాడు.

ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకించి విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే తీవ్రమైన గ్యాస్‌ సంబంధిత సమస్య కారణంగా బన్నీ ఈ ఈవెంట్‌కి రాలేకపోయాడు” అని చెప్పుకొచ్చాడు. 2018లో శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తండేల్‌ రూపొందింది. శ్రీకాకుళంకు నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన జాలరులు అనుకోకుండ పాకిస్తాన్‌ సరిహద్దులో ప్రవేశిస్తారు. దీంతో పాక్‌ నేవీ వారిని అరెస్ట్‌ చేస్తుంది. ఈ యథార్థ సంఘటన ప్రేమ, దేశభక్తి జోడించి కథ రాసుకున్నాడు. దానిని తండేల్‌ ఫిబ్రవరి 7న ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాడు.

Exit mobile version
Skip to toolbar