Alia Bhatt : బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. కాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన ఈ బ్యూటీ.. పెళ్ళి చేసుకుని.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక తన పాప కోసం దాదాపు 2 ఏళ్ళు.. సినిమాలకు విరామం ప్రకటించింది ఆలియా భట్. అటు రణ్ బీర్ కూడా తన పాపతో టైమ్ స్పెండ్ చేయడం కోసం కొంత కాలం సినిమాలకు విరామం ప్రకటించాడు.
అయితే ఆమె అంతకు ముందు నటించిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యాయి. బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ భామ.. హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే హాలీవుడ్ చిత్రాల్లో నటించగా.. ప్రియాంక చోప్రా మాత్రం హాలీవుడ్ లోనే వరుస సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా మారింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎంతమేర అలరిస్తుందో చూడాలి.
గాల్ గాడోట్, జామీ డోర్నాన్, సోఫీ ఒకొనెడో, మాథియాస్, జింగ్ లూసిలు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’. ఈ చిత్రానికి టామ్ హార్పర్ దర్శకుడుగా వ్యవహరిస్తుండగా.. అలియా భట్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ గమనిస్తే ఆ సినిమాలో అలియా విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్‌లతో అలియా దుమ్ము లేపింది.