Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం కారణంగా తరుచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సర్వస్వం భారత్ అని వివరించారు.
తన పాస్‌పోర్టును మార్చుకోవడానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్టు అక్షయ్ చెప్పారు.
కొందరి మాటలు భాదను కలిగిస్తున్నాయి: అక్షయ్
అక్షయ్ తాను కెనడా పౌరసత్వాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోకుండా కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండటం తనను బాధిస్తోందని అక్షయ్ అన్నారు.
‘ఇండియానే నాకు సర్వం.. నేను ఏం సంపాదించినా.. సాధించినా.. అన్నీ ఇక్కడి నుంచే. పొందిన దాని నుంచి తిరిగి చెల్లించే అదృష్టం కూడా నాకు దక్కింది.
కానీ, ఏమీ తెలియకుండా కొందరు మాట్లాడే డకలిగిస్తున్నాయి’ అని అక్షయ్ తెలిపారు.
అందుకే కెనడా వెళ్లాను(Akshay Kumar)
నమస్తే లండన్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా, ప్యాడ్‌మ్యాన్ వంటి సినిమాలతో అలరించిన అక్షయ్ కుమార్.. 1990లో కెరీర్ సరిగా లేనప్పుడు 15 సినిమాలకు పైగా ఫ్లాప్ అయ్యాయి.
తన సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో కెనడా పౌరసత్వానికి దరఖాస్తు చేసినట్టు అక్షయ్ వివరించారు.
ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే కెనడాకు పని కోసం వెళ్లాను.
నా ఫ్రెండ్ ఒకరు కెనడాలో ఉన్నారు. నన్ను అక్కడకు రమ్మన్నాడు. అంతే నేను పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నాను. అక్కడికి వెళ్లాను’అని వివరించారు.
ఆ సమయంలో మరో రెండు సినిమాలు మాత్రమే విడుదల కావాల్సి ఉన్నాయని, తన లక్కు తిరిగి.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని వివరించారు.
దీంతో మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చాయని, అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నట్టు పేర్కొన్నారు.
ఆ తర్వాత కెనడా పాస్‌పోర్టు గురించి తాను మరిచిపోయినట్టు చెప్పారు. దాన్ని కచ్చితంగా మార్చుకోవాలనే ఆలోచన కూడా రాలేదని అన్నారు.
ఇప్పుడు ఆ పాస్ పోర్టును మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. కెనడా పౌరసత్వం వదులుకుంటున్నానని స్పష్టం చేశారు.
2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో అక్షయ్ కుమార్ పౌరసత్వం పై తీవ్ర దుమారం రేగింది.