Site icon Prime9

Akkineni Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య #NC23 లో హీరోయిన్ ఎవరంటే..?

Akkineni Naga Chaitanya and chandu mondeti movie heroin confirmed

Akkineni Naga Chaitanya and chandu mondeti movie heroin confirmed

Akkineni Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య .. తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 లో.. చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ఇది రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న చిత్ర యూనిట్.. పక్కా ప్లానింగ్ తో మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తుంది.

ఇటీవల ఈ టీం అంతా కలిసి మత్స్యకారులు ఉండే ప్రాంతాన్ని పరిశీలించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే హీరోయిన్ ఎవరో పూర్తిగా రివీల చేయకుండా ఎంట్రీని మాత్రం తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఆమె ఎవరో కనిపెట్టేశారు. దాంతో గతంలో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో ఈ కాంబినేషన్ ని ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాలో ఈ జంట మరోసారి కనిపించబోతున్నారని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకుంది. హీరోయిన్ ని కనిపెట్టడానికి ప్రధాన కార్యణాల్లో ఒకటి సాయి పల్లవి చేతికి ఉండే రుద్రాక్ష మాల.. జుట్టు, ఆమె డ్రెస్సింగ్ ఇవన్నీ చూసి గుర్తు పడుతున్నారు.

అక్కినేని వారసుడు నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) అంటే తెలియని వారుండరు. జోష్ సినిమాతో పరిచయం అయినా.. తక్కువ సమయం లోనే తండ్రి కి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నాడు. ఇక ఏం మాయ చేసావే సినిమాతో ఏర్పడిన సమంత – నాగ చైతన్యల పరిచయం.. అనంతరం ప్రేమగా మారి.. పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ ప్రేమ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. దీంతో నాగ చైతన్య ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇక ఇటీవల నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సమంతతో విడిపోయిన తర్వాత చైతు ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Exit mobile version