Site icon Prime9

Agent Ott Release : అప్పుడే ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన అక్కినేని అఖిల్ “ఏజెంట్”..

akkineni akhil agent ott release date fix and going to streaming on sony live

akkineni akhil agent ott release date fix and going to streaming on sony live

Agent Ott Release : అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. కానీ మొదటి నుంచి సినిమాకి ఉన్న హైప్స్ రీత్యా.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. ఈ మేరకు ఇటీవల ఏజెంట్ ఫలితంపై సినిమా నిర్మాత అనిల్ సుంకర స్వయంగా స్పందించారు.

ట్విట్టర్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. తప్పు తమదేనంటూ.. అభిమానులను క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఆ ట్వీట్ లో.. ఏజెంట్‌ చిత్రంపై పడుతున్న నిందలన్నీ మేమే భరించాలి. ఇది చాలా కష్టమైన పని అని తెలిసినప్పటికీ గెలవాలని అనుకున్నాం. కానీ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ ప్రారంభించి తప్పు చేయడం, కొవిడ్‌ సహా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో అలా చేయడంలో విఫలమయ్యాం. ఈ విషయంలో ఎలాంటి సాకులు చెప్పకూడదనుకుంటున్నాం. కానీ కాస్ట్‌లీ మిస్టేక్ నుంచి నేర్చుకుని, ఇలాంటివి ఎప్పటికీ రిపీట్ కాకుండా ఎలా తిరిగొస్తామో చూడండి. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు. మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో డెడికేటెడ్ ప్లానింగ్‌తో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తాము’ అని ట్వీట్ చేశారు నిర్మాత అనిల్.

థియేటర్స్ లో ఇక రన్ అవడం కష్టమని భావించిన మేకర్స్.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లీవ్ సంస్థ మే 19న ఓటీటీలో ఏజెంట్ మూవీని స్ట్రీమ్ చేయనున్నట్లు వెల్లడించింది. అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.  సాధారణంగా కొత్త సినిమాలు ఎగ్రిమెంట్ ప్రకారం ఐదు వారాల తర్వాత స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల ఓటీటీల వ్యూయర్ షిప్ బాగుంటుంది. అలాగే ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని 18 కోట్లకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్టైలిష్ డైరెక్టర్‌ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సుమారు రూ.80 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించారు. ఇక రిలీజైన మొదటి రోజు రూ.7 కోట్ల గ్రాస్ అందుకుంది.

Exit mobile version