Aishwarya Rai: ఫ్రాన్స్ లో 76 వ కేన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రెటీలు సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోతున్నారు. కేన్స్ ఫెస్టివల్ కు, ఐశ్వర్య రాయ్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. రెండు దశాబ్ధాలుగా ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతోంది. ఈ సారి 21 వ కేన్స్ లో అప్పీరియన్స్ ఇచ్చింది.
ఐష్ డ్రెస్ పై మిక్స్ డ్ రియాక్షన్స్(Aishwarya Rai)
అసలు కేన్స్ ఫెస్టివల్ అంటేనే డిజైనర్ దుస్తులు గుర్తుకు వస్తాయి. వరల్డ్ వైడ్ గా క్రియేటివ్ డిజైనర్స్ తమ డిజైన్స్ ను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఇందులో ప్రతి ఏడాది ఐశ్వర్య రాయ్ వేసుకునే ఔట్ ఫిట్ పైనే అందరి చూపులు ఉంటాయి. ఇందులో భాగంగా 76 వ కేన్స్ లో కూడా సిల్వర్ అండ్ బ్లాక్ గౌన్ లో మెరిసింది ఈ మాజీ ప్రపంచ సుందరి. అయితే ఐశ్వర్య డ్రెస్ పై సోషల్ మీడియాలో మిక్స్ డ్ రియాక్షన్స్ వచ్చాయి.
వెండి పూత పూసినట్టు ఉన్న గౌన్ తో పాటు అదే రంగులో హుడీ కూడా ధరించింది. దీంతో ఆ డ్రెస్ పై కొందరు ట్రోల్స్ మొదలు పెట్టారు. ‘వెండి హుడీ ఏంటీ విడ్డూరం కాకపెతే’.. ‘మీరు డిజైనర్ ను మార్చండి’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే మరికొంతమంది మాత్రం ఫ్యాషన్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ఐశ్వర్య డ్రెస్ ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య కేన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఊర్వశి నెక్ పీస్ పై
మరోవైపు కేన్స్ లో పాల్గొన్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా వేసుకున్న నెక్లెస్‌పై కూడా మీమ్స్ హల్ చల్ చేశాయి. పింక్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఊర్వశి, మెడలో మాత్రం బల్లి డిజైన్ నెక్లెస్‌ను ధరించింది. ఇయర్ రింగ్స్ కూడా అలాంటివే పెట్టుకుంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. నెక్లెస్ కిందపడితే నిజం బల్లి అనుకొని భయపడతారేమో జాగ్రత్త.. అంటూ కామెంట్స్ చేశారు.