Site icon Prime9

zaheer Iqbal- Shatrughan Sinha: శత్రుఘ్నసిన్హాతో భేటీ అయిన జహీర్ ఇక్బాల్ ఫ్యామిలీ

zaheer Iqbal- Shatrughan Sinha

zaheer Iqbal- Shatrughan Sinha

zaheer Iqbal- Shatrughan Sinha: బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ఈ నెల 23న తన చిరకాల మిత్రుడు జహీర్‌ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ జహీర్‌ సోనాక్షి తండ్రి.. బాలీవుడ్‌ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్నసిన్హాతో భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి నవ్వుకుంటూ కెమెరాలకు ఫోజు ఇచ్చారు. వారితో పాటు సోనాక్షి కూడా వైట్‌ కలర్‌ డ్రెస్‌లో కనిపించారు.కాగా ఇప్పటికే వీరుద్దరు తమ మిత్రులకు బాచిలర్‌ పార్టీలు ఇచ్చారు. ఆ పార్టీలకు చెందిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

సోనాక్షికి అత్యంత సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ నెల 23న ముంబైలో వీరి వివాహం జరగబోతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు జహీర్‌.. అటు సోనాక్షి పెళ్లికి ఆహ్వానం పంపుతూ విడుదల చేసిన ఆడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ ఆడియో లీక్‌ అయ్యింది. ఈ ఆడియోలో తాము ఇద్దరం ఒకటి కాబోతున్నాం. ఈ నెల 23న అధికారికగా భార్య, భర్తలవుతామని ప్రకటించారు.

వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌..(zaheer Iqbal- Shatrughan Sinha)

ఇక వీరి వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ విషయానికి వస్తే ఓ మాగజైన్‌లా ఉంది. మాగజైన్‌ కవర్‌పై హెడ్‌లైన్‌ రాసి ఉంది. కాగా ఇన్వెటేషన్‌లో జహీర్‌తో పాటు సోనాక్షి ఫోటో ఉంది. వెనుకభాగాన మొత్తం మంచుతో కప్పబడి ఉంది. సోనాక్షి చెంపపై జహీర్‌ ముద్దు పెట్టిన ఫోటో అందరిని ఆకర్షిస్తోంది. అయితే వీరిద్దరు 2020 నుంచి డేటింగ్‌ చేస్తున్నారు. వీరిద్దరిపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చినా.. అధికారికంగా దీని గురించి వారు ఎక్కడ నోరు విప్పలేదు. బహిరంగంగా వారు తమ పెళ్లి ప్రాస్తావన ఎక్కడా తెలేదు. కాగా వీరిరువు 2022లో విడుదలైన డబుల్‌ ఎక్స్‌ఎల్‌ సినిమాలో కలిసి నటించారు. వారి మధ్య రిలేషన్‌ షిప్‌ గురించి ఇప్పటి వరకు నోరు విప్పలేదు. అయితే ఇన్‌స్టాగ్రాంలో వీరిద్దరి ఫోటోలు పెద్ద ఎత్తున హల్‌ చల్‌ చేస్తున్నాయి.

Exit mobile version