Site icon Prime9

Unstoppable Show : ప్రభాస్‌ని బాలకృష్ణ ఏ ప్రశ్నలు అడగాలో మీరే చెప్పండి : ఆహా

aha post about balakrishna and prabhas episode on unstoppable show

aha post about balakrishna and prabhas episode on unstoppable show

Unstoppable Show : ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాదించాడు బాలయ్య. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. సీజన్ 1 ని విజయవంతంగా కంప్లీట్ చేసిన బాలయ్య అదే ఊపులో సీజన్ 2 ని కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే అదిరిపోయే గెస్ట్ లను తీసుకు వచ్చిన ఆహా టీమ్, ఈసారి పాన్ ఇండియా గెస్ట్ పై కన్నేశారు.

గత కొన్నిరోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్, అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కి అతిధిగా రాబోతున్నాడు అంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ వార్తలను నిజం చేస్తూ త్వరలోనే ప్రభాస్ ఈ షో కి గెస్ట్ కి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ – బాలయ్య మూవీస్ లను మిక్స్ చేసి ఒక స్పెషల్ వీడియోని కూడా విడుదల చేశారు. దీంతో ఇటీవల షో కి గెస్ట్ లుగా వచ్చిన యంగ్ హీరోలను పలు చిలిపి ప్రశ్నలు అడిగిన బాలకృష్ణ ప్రభాస్ ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది.

కాగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు ఆహా టీం ఓ సర్ప్రైజ్ గుఫ్ట్ ఇచ్చింది. “మీరు ప్రభాస్ ని ఎటువంటి ప్రశ్నలు అడగాలి అని అనుకుంటున్నారో ” అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ తో డార్లింగ్ అభిమానులంతా ప్రభాస్ ఈ ప్రశ్న అడగండి, ఈ ప్రశ్న అడగండి అంటూ పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. వాటన్నిట్లో ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించే ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి. మరి ప్రభాస్ ఈ ప్రశ్నలకు ఎలా బదులిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version