Site icon Prime9

Actress Swathi : విడాకుల విషయంపై స్పందించిన కలర్స్ స్వాతి.. షాకింగ్ రిప్లై !

Actress Swathi response on her divorce news

Actress Swathi response on her divorce news

Actress Swathi : ప్రముఖ తెలుగు హీరోయిన్ స్వాతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వెండి తెరపై కూడా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, డేంజర్, సుబ్రమణ్యపురం, అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్‌, కార్తికేయ, స్వామిరారా తదితర హిట్‌ సినిమాల్లో నటించింది. కాగా 2018 లో పెళ్లి తరువాత సినిమాలకి గ్యాప్ ఇచ్చింది ఈ భామ. ఇక మళ్ళీ తిరిగి సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. గత ఏడాది పంచతంత్రం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె.. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక థీమ్ సాంగ్ లో నటించి అలరించారు.

ప్రస్తుతం ఈ భామ నటించిన ‘మంత్ అఫ్ మధు’ చిత్రం రిలీజ్ కి సిద్ధమైంది. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవీన్ చంద్ర, స్వాతి (Actress Swathi)  జంటగా నటించిన ఈ సినిమాలో శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇంతకు ముందు నవీన్ చంద్రతో ఆయన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా తీశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న స్వాతి.. మూవీ టీం తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

అయితే ఈ క్రమంలోనే పలువురు విలేకర్లు ఆమె విడాకుల వార్తలు గురించి ప్రశ్నించారు. ఈ విషయం పై స్వాతి.. నవ్వుతూనే సీరియస్ గా కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..  ఈ కార్యక్రమానికి, ఆ ప్రశ్నకు సంబంధం లేదు. అనవసరం అని నా అభిప్రాయం. నేను సమాధానం చెప్పను” అని స్వాతి స్పందించారు. అయినా కానీ మళ్ళీ అదే ప్రశ్నను అడగడంతో స్వాతి బదులిస్తూ.. “నేను ఇవ్వను. నేను చెప్పను. నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి” అంటూ బదులిచ్చింది. దీంతోప్రస్తుతం స్వాతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా ఇటీవల స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన మ్యారేజ్ ఫోటోలను తొలిగించింది. దాంతో స్వాతి కూడా పలువురు నటీనటుల బాటలో విడాకులు తీసుకోబోతుందా.. అని వార్తలు రావడం మొదలయ్యాయి. చూడాలి మరి ఈ విషయానికి ఇక్కడితే ఫుల్ స్టాప్ పడుతుందో లేదో అని.

Exit mobile version