Site icon Prime9

Actress Sadaa : పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన “సదా”.. ఇటీవల వాళ్ళని చూస్తూనే ఉంటున్నాం అంటూ !

actress sadaa shocking comments on marriage

actress sadaa shocking comments on marriage

Actress Sadaa : ప్రముఖ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోకి నితిన్ హీరోగా వచ్చిన “జయం” సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న.. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్‌ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వడంతో సదా కి వరుస సినిమా అవకాశాలు క్యూలు కట్టాయి. ఆ తర్వాత తమిళ అగ్ర దర్శకుడు ఎన్.శంకర్ తో అపరిచితుడు సినిమాలో విక్రమ్ కి జోడిగా నటించి ఇండస్ట్రీలో హీరోయిన్ గా టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది.

దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో సదా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా.. సదా సినీ కెరీర్ పట్టాలు తప్పింది. కథల ఎంపికలో హీరోయిన్ గా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోకుండా.. మూస ధోరణి తో సినిమాలు చేసుకుంటూ పోవడంతో.. తనకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది ఈ బ్యూటీ.  2002 నుంచి 2018 వరకు వరుసగా సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన సదా ప్రస్తుతం మళ్ళీ యాక్టివ్ గా మారుతుంది. పలు టీవి షో లలో కనిపిస్తూ సందడి చేస్తున్న ఈ భామ.. పలు భాషల్లో నటిస్తుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సదాని.. పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనికి సదా బదులిస్తూ.. “పెళ్లి చేసుకున్న తరువాత ఫ్రీడమ్ ఉండదు. నాకు నచ్చింది నేను చేయలేను. ప్రస్తుతం నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను. మనల్ని అర్ధం చేసుకునే వ్యక్తి  దొరికితే పెళ్లి జీవితం బాగానే ఉంటుంది. కానీ అలా జరగకపోతే విడిపోవాల్సి వస్తుంది. ఇటీవల కొంతమంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని విడిపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. అలా విడిపోవడంకన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్” అంటూ వ్యాఖ్యానించింది. దీంతో సదా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version