Site icon Prime9

Actress Pragathi : జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సత్తా చాటిన నటి ప్రగతి.. కాంస్యం కైవసం

Actress Pragathi won bronze medal in national level weight lifting championship

Actress Pragathi won bronze medal in national level weight lifting championship

Actress Pragathi : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి “ప్ర‌గ‌తి”. తల్లి, అత్త, కూతురు, చెల్లెలు ఇలా అన్ని పాత్రల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎఫ్ 2, బాద్ షా సినిమాల‌తో ప్ర‌గ‌తి మరింత పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తున్నారు నటి ప్రగతి. హాట్ హాట్ ఫోజుల‌తో ఫోటో షూట్ లు చేయ‌డంతో పాటు, కరోన లాక్ డౌన్ సమయంలో ఫిట్నెస్ వీడియోల‌తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.  ఓవైపు నటిగా ఎంటర్‪టైన్ చేస్తూనే మరోవైపు జిమ్‌లో వర్కౌట్స్‌తో బాగా పాపులర్ అయింది. అయితే అవన్నీ సరదాగా చేస్తుందని చాలామంది అనుకున్నారు.

కానీ రీసెంట్ గానే రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణమిది. రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీరతాను. ప్రస్తుతం నా స్కోరు 250. అయితే టార్గెట్ చాలా పెద్దదే.. దాన్ని చేరేవరకు ప్రయత్నిస్తాను అని అంటూ పోస్ట్ చేసి ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది.

కాగా ఇప్పుడు తాజాగా ప్రగతి బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొంది. కేవలం పాల్గొనడమే కాకుండా కాంస్య పతకం కూడా అందుకొని ఔరా అనిపించింది. 48 ఏళ్ళ వయస్సులో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించడం పట్ల పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ వీడియోను ప్రగతి ఇన్ స్టా లో షేర్ చేస్తూ.. ” నా కథ మొత్తం బ్యాడ్ నిర్ణయాలతో నిండిపోయింది. హార్ట్ బ్రేక్స్, ఏమి చేయలేని పరిస్థితులు.. కానీ, ఇది నాకు పునర్జన్మ. బూడిద నుంచి మళ్లీ పైకి లేవడం నేర్చుకుంటున్నాను. ఎప్పుడు వదులుకోవద్దు అనేది నా జీవిత మంత్రం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

 

Exit mobile version