Nidhi Agarwal Files Cybercrime complaint: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ హీరోయిన్, నటి నిధి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని వేధిస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి తనని చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా కొద్ది రోజులుగా ఓ వ్యక్తి తనని, తన ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపు కామెంట్స్ చేస్తున్నాడు. నన్ను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పంపిస్తున్నాడు. అలాగే నాకు సన్నిహితంగా ఉండేవారిని కూడా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతడి కొద్ది రోజులుగా తాను మానసిక ఒత్తిడికి లోనవుతు్నానని, సదరు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ ఫిర్యాదులో పేర్కొంది.
సవ్యసాచి, మజ్ను వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిధి ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకుంది. ఆఫర్స్ లేక కోలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ కూడా వరుస ఆఫర్స్‌తో అందుకుంది. కానీ అక్కడ కూడా ఆశించిన విజయం, గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం ఇక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ప్రభాస్, మారుతి చిత్రం రాజా సాబ్‌లోనూ నటిస్తుంది. ఏకంగా రెండు భారీ చిత్రాలతో రీఎంట్రీలో నిధి అగర్వాల్ దూసుకుపోతుంది.