Site icon Prime9

Actor Vishal : ఆ హీరోయిన్ తో పెళ్లి గురించి స్పందించిన హీరో విశాల్.. ఏమన్నాడంటే ?

Actor Vishal serious comments on marriage with lakshmi menon

Actor Vishal serious comments on marriage with lakshmi menon

Actor Vishal : సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు విశాల్. కాగా విశాల్ పెళ్లి మ్యాటర్ కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. ఆయన పెళ్లిపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో పెళ్లి అన్నారు. కానీ నడిగర్ సంఘం ఎలక్షన్స్ పుణ్యమా అని అది కూడా పెటాకులు అయ్యింది.

ఇక ఆ తర్వాత 2019లో విశాల్ హైదరాబాద్ కి చెందిన ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కారణం తెలియదు కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. విశాల్ మరలా సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయతో పెళ్లి ఫిక్స్ అన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ పెళ్లి సెటిల్ అయ్యిందని అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయని ప్రస్తుతం ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విశాల్ రియాక్టయ్యారు. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్‌లో వీరి పెళ్లి మ్యాటర్ గురించి విశాల్ ఘాటుగా స్పందించారు.

ఈ మేరకు ట్విట్టర్ లో.. తనపై వచ్చే రూమర్లపై తానెప్పుడూ స్పందించలేదని.. కానీ, ఒక అమ్మాయిని ఇందులోకి లాగడం వల్లే స్పందిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ‘నా గురించి వచ్చే తప్పుడు వార్తలు, రూమర్లపై సాధారణంగా నేను స్పందించను. ఎందుకంటే, వాటి ఎలాంటి ఉపయోగంలేదని నేను భావిస్తాను. కానీ, ఇప్పుడు లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లంటూ చక్కర్లు కొడుతున్న రూమర్లపై స్పందించక తప్పలేదు. ఈ రూమర్లను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ రూమర్‌లో ఎలాంటి నిజం లేదు, నిరాధారం. దీనిపై నేను స్పందించడానికి కారణం.. దీనిలోకి ఒక అమ్మాయిని లాగారు. ఆమె ఒక నటి. మీరు ఒకమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆమె పరువు, మర్యాదలను మంటగలుపుతున్నారు.

నేను భవిష్యత్తులో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను.. సంవత్సరం, తేదీ, సమయం డీకోడ్ చేయడానికి ఇదేమీ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం కాదు. దేనికైనా సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు నా పెళ్లి గురించి నేను అధికారికంగా ప్రకటిస్తాను. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అని విశాల్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

Exit mobile version