Site icon Prime9

Actor Surya : భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన సుధా కొంగర.. సూర్యతో కలిసి వస్తున్న దుల్కర్ !

Actor Surya and dulquer acting under sudha kongara direction

Actor Surya and dulquer acting under sudha kongara direction

Actor Surya : నటుడు సూర్య గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో గజిని, సింగం వంటి సినిమాలతో మంచి గుర్తింపును పొందాడు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ వంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నారు.

అయితే సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహించిన ‘సూరారై పొట్రు’ భారీ విజయం సాధించింది. ఆ సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో తెలుగులో విడుదల అయ్యింది. ఇక్కడ కూడా భారీ హిట్ అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలానే ఉత్తమ సినిమాగా జాతీయ పురస్కారం అందుకుంది. ఇక ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

సూర్య 43వ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని ఆయన (Actor Surya) సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. సంగీత దర్శకుడిగా ఆయనకి ఇది 100వ చిత్రం కావడం విశేషం. అదే విధంగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తుండడం మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ఇదే సినిమాలో నజ్రియా హీరోయిన్ గా చేస్తుండగా.. తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ నటిస్తున్నాడు. తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారని టాక్ వినిపిస్తుంది.

 

సూర్య (Actor Surya) చేస్తున్న మూవీ `కంగువ` అంటే అగ్ని శక్తి ఉన్న యోధుడు, శక్తివంతమైన పరాక్రమవంతుడు అని అర్థం. దీంతో సూర్య ఇందులో గతంలో ఎప్పుడూ కనిపించనటు వంటి యుద్ధ వీరుడిగా నటిస్తున్నట్టు తెలుస్తుంది.  2024 ప్ర‌థ‌మార్థంలోనే కంగువా సినిమాను విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్రొడ్యూస‌ర్స్ చెప్పేశారు. ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని హీరోయిన్‌గా న‌టిస్తోంది. స్టూడియో గ్రీన్‌, యువీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా రూపొందుతోంది. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని పది భాషల్లో భారీ పాన్‌ ఇండియా చిత్రంగా 3డీలో తెరకెక్కిస్తున్నారు. అలానే ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండటం విశేషం.

Exit mobile version