Site icon Prime9

Rahul Ramakrishna : నన్ను అతనితో కంపేర్ చేయొద్దంటున్న రాహుల్ రామకృష్ణ..?

actor rahul ramakrishna interesting post goes viral

actor rahul ramakrishna interesting post goes viral

Rahul Ramakrishna : టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కూడా విజయ్ దేవరకొండ చేసిన సినిమాల ద్వారానే ఇండస్ట్రికి పరిచయం అయ్యి.. మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. పెళ్లిచూపులు సినిమాతో ప్రియదర్శి మంచి గుర్తింపు సంపాదించుకుంటే, ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో రాహుల్ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. జాతి రత్నాలు సినిమాతో వీరిది డెడ్లీ కాంబో అని అంతా ఫిక్స్ అయిపోయారు.

అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒక పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోపక్క మెయిన్ లీడ్ తో కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇక ఇటీవల ప్రియదర్శి బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ ‘ఇంటింటి రామాయణం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. దీంతో కొంతమంది నెటిజెన్లు వీరిద్దర్నీ కంపేర్ చేస్తూ కొన్ని పోస్టులు వేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఒక పోస్ట్ పై రాహుల్ రియాక్ట్ అయ్యాడు.

 

 

తనని ప్రియదర్శితో కంపేర్ చేయొద్దని, అలా చేయడం తనని అగౌరవ పరిచినట్లు అవుతుందని పేర్కొన్నాడు. తను గొప్ప నటుడు. ఇలా కంపేర్ చేయడం చీప్ గా ఉందంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్టుకి కొందమంది అభిమానులు రియాక్ట్ అవుతూ.. ‘మాకు నువ్వు కూడా గ్రేట్ బ్రో’ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ.. కాగా గత ఏడాది మే నెలలో తన పెళ్లి వార్త చెప్పాడు ఈ స్టార్ కామెడియన్. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ.. తను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు. ఆ తరువాత మళ్ళీ పెళ్లి వార్త గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు రాహుల్. సడన్ గా గత ఏడాది నవంబర్ లో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇక రీసెంట్ గానే వీరికి ఒక బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే.

Exit mobile version