Site icon Prime9

Actor Nani: గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని

actor nani

actor nani

Actor Nani: నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ రగ్డ్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. కాగా నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఈ సినిమా మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గుండెల్ని హత్తుకునే మాస్.. (Actor Nani)

తాను ఇప్పటి వరకు మాస్ సినిమాలు చేసి మెప్పించానని.. కానీ దసరా సినిమాతో గుండెల్ని హత్తుకునే మాస్‌ని చూపిస్తానని నేచురల్ స్టార్ నాని అన్నాడు.

దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ఈ వ్యాఖ్యలు చేశాడు. మాస్ అన్నప్పుడు విజిల్స్ వేస్తుంటామని, కానీ దసరాలోని మాస్ చూశాక కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని, దానికితోడు విజిల్స్ కూడా వేస్తారని పేర్కొన్నాడు.

ఈ సినిమాతో కచ్ఛితంగా ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తానని ప్రామిస్ చేశాడు.

ఇది తన మనసుకి చాలా దగ్గరైన సినిమా అని.. ఒక సంవత్సరం పాటు ఆ దుమ్ము, ధూళిలో చాలా కష్టపడి పని చేశామని తెలిపాడు.

ఈ సినిమా కోసం తన చిత్రబృందం ఎంతో కష్టపడిందని, వాళ్లందరికీ ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పాడు.

ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్న ప్రతిఒక్కరి జీవితంలోనూ ఈ సినిమా చాలా ప్రత్యేకంగా, మెమొరబుల్‌గా నిలిచిపోతుందని అన్నాడు.

ఇతర సినిమాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుందని నాని అన్నాడు. ఇందులో తన స్నేహితులుగా నటించిన వారి పాత్రలు కాస్త భిన్నమని నాని తెలియజేశాడు.

ఏదో సినిమాలో పాత్రల్లో కాకుండా, రియల్ లైఫ్ స్నేహితులుగా అందరూ ఆ పాత్రలకు జీవం పోశారని నాని అన్నారు.

80 ఏళ్ల తర్వాత కలుసుకుంటే, మళ్లీ ఆ పాత్రల గురించి ప్రస్తావించుకునేంత గొప్ప బాండింగ్ తమ మధ్య ఏర్పడిందని చెప్పాడు.

ఈ దసరా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, దసరా మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నాడు. ఇక కాసర్ల శ్యామ్ రాసిన ప్రతీ లిరిక్ సెన్సేషన్‌గా మారిందని, ఇకపై ఆయన పాటల కోసం మ్యూజిక్ కంపెనీలు క్యూ కడతాయని వెల్లడించాడు.

Exit mobile version
Skip to toolbar