Site icon Prime9

Actor Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందా..?

actor arjun daughter aishwarya marriage rumours goes viral

actor arjun daughter aishwarya marriage rumours goes viral

Actor Arjun : సౌత్ ఇండస్ట్రిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి యాక్షన్ కింగ్ గా గుర్తింపు పొందారు హీరో అర్జున్ (Actor Arjun). ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితులే. ఇక ప్రస్తుతం సపోర్టింగ్ రూల్స్ లో నటిస్తూ అర్జున్ బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా తన టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అర్జున్ వ్యక్తిగత విషయానికి వస్తే అతనికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పటికే ఐశ్వర్య మూడు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.

తమిళంలో హీరో విశాల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తరువాత కన్నడలో కూడా ఒక సినిమా చేసింది. ఇక తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవుతూ ఒక సినిమా ప్రకటించిన అది అనౌన్స్‌మెంట్ తోనే ఆగిపోయింది. కాగా ప్రస్తుతం ఐశ్వర్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్ల నుంచి ఐశ్వర్య ఒక స్టార్ కమెడియన్ కొడుకుతో ప్రేమలో ఉన్నట్లు ఆ వార్తల సారాంశం.

ఇక ఇప్పుడు వీరిద్దరి ప్రేమకు రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నెల్ రావడంతో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరంటే .. తమిళ పరిశ్రమలో తన కామెడీతో ఎంతోమంది అలరిస్తున్న ‘తంబి రామయ్య’ కుమారుడు ‘ఉమాపతి’ అని తమిళ్ మీడియా వర్గాలు రాసుకొస్తున్నాయి. అయితే దీని గురించి ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి సమాచారం బయటికి రాకపోయినప్పటికి సోషల్ మీడియా వ్యాప్తంగా మాత్రం కోడై కూస్తుంది. కాగా ఉమాపతి తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఒక టెలివిజన్ షో కూడా చేస్తున్నాడు.

 

 

అదే విధంగా అర్జున్ తన కూతుర్ని టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయాలని చూశారు. విశ్వక్ సేన్ ని హీరోగా.. ఐశ్వర్య హీరోయిన్ గా.. అర్జున్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయ్యి.. పలు కారణాల రీత్యా ఆ మూవీ ఆగిపోయింది.

Exit mobile version