Site icon Prime9

2018 Movie Ott: ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘2018’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

2018 Movie Ott

2018 Movie Ott

2018 Movie Ott: కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. మలయాళంలో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై.. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవల తెలుగులోకి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ‘2018’ చిత్రం ఓటీటీ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సోనిలివ్ దక్కించుకుంది. జూన్ 7 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చింది సోనీలివ్ యాప్.

 

అనూహ్య‌మైన ఆటుపోట్ల‌కి(2018 Movie Ott)

ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు టోవినో థామస్. ఓ పెద్ద మోడ‌ల్ కావ‌డ‌మే ల‌క్ష్యంగా కష్టపడుతుంటాడు మ‌త్య్స‌కార కుటుంబానికి చెందిన అసిఫ్ అలీ. టూరిస్ట్‌ల‌కి త‌ల‌లో నాలుక‌లా ఉంటూ కుటుంబాన్ని పోషించే టాక్సీ డ్రైవ‌ర్ అజు వ‌ర్ఘీస్‌, కేర‌ళ బోర్డర్ లో ఉండే త‌మిళ‌నాడు గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవ‌ర్ క‌లైయార‌స‌న్‌. ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ప‌నిచేసే కుంచ‌కో బొబన్‌ .. ఇలా ఎవ‌రి జీవితాలు వారివి, ఎవ‌రి ప‌నులతో వాళ్లు స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. కానీ కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే వాళ్ల జీవితాలు అనూహ్య‌మైన ఆటుపోట్ల‌కి గుర‌వుతాయి. అది ఎవరూ ఊహించరు. భారీ వ‌ర్షాల‌తో కేర‌ళ‌ ని వ‌ర‌ద‌లు ముంచెత్తుతాయి. దీంతో ఎవ‌రి జీవితాలు ఎలా మారాయి? ప్రాణాలు నిలుపుకొంటే చాలు అనుకునే ప‌రిస్థితుల్లో ఒక‌రి కోసం మ‌రొక‌రు ఎలా నిల‌బ‌డ్డారు అనేది సినిమా లో చూడాల్సిందే.

 

 

Exit mobile version