TSRTC Notification: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.తెలంగాణ రవాణా శాఖలో టీఎస్ఆర్టీసి అప్రెంటిస్ లకు దరఖాస్తులను పెట్టుకోనే అవకాశం కల్పించింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. ఆర్టీసీలో ఇంజనీరింగ్ విభాగంలో,నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటీస్ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను లాగ్ ఇన్ అయి చూసుకోవచ్చు.ఆర్టీసీలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు.ఈ ప్రకటనలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ పోస్టుల్లో తీసుకోకునున్నారు.అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చని సూచించారు.అధికారిక వెబ్ సైట్ లాగ్ ఇన్ అయి దీనిలో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
కావలిసిన అర్హతలు :
ఈ అప్రెంటీసుకు బీటెక్, బీఈ చేసిన ఉత్తీర్ణత సాధించిన వారు ఇంజనీరింగ్ పోస్టులకు అర్హులవుతారని పేర్కొన్నారు.నాన్ ఇంజనీరింగ్ విభాగంలోని పోస్టులకు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ అభ్యర్తులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.నాన్ ఇంజనీరింగ్ విభాగంలోని పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.
మరిన్ని వివరాలకు తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.in వెబ్ సైట్ లాగ్ ఇన్ అయి చూసుకోవచ్చు.
ఇదీ చదవండి : Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పోస్టులకు ధరఖాస్తులను కోరుతుంది!