PhD: చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు మరికొంత మంది అధ్యయనకారులు డాక్టరేట్ తీసుకోవడానికి ఉత్సాహం కనపరుస్తుంటారు. కొంత మంది రెగ్యులర్ బేసిస్ లో పీహెచ్ డీ చేస్తుంటే మరికొంత ఆన్ లైన్ విధానంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంటుంటారు. కాగా ఈ నేపథ్యంలో యూజీసీ ఓ కీలక ప్రకటన వెలువరించింది. ఆ ఆన్ లైన్ పీహెచ్ డీలకు ఎటువంటి గుర్తింపు లేదంటూ ఉత్తర్వుల ద్వారా పేర్కొనింది.
విదేశీ విద్యాసంస్థల సహకారంతో ఎడ్‌టెక్ సంస్థలు అందించే ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు అనుమతి లేదని అలా తీసుకున్న హీహెచ్ డీలకు ఎటువంటి గుర్తింపు ఉండదంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొనింది. ఈ మేరకు ఓ ప్రకటనను యూజీసీ మరియు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అక్టోబరు 28న సంయుక్తంగా ప్రకటించాయి. ఉన్నత, సాంకేతిక విద్య నిబంధనలను అనుసరించి విద్యార్థులను అప్రమత్తం చేసేలా యూజీసీ, ఏఐసీటీఈలు హెచ్చరిక జారీ చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. దూరవిద్య, ఆన్‌లైన్ విధానంలో విద్యార్థులకు ఉన్నత విద్య కోర్సులను అందించొద్దంటూ ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే యూజీసీ, ఏఐసీటీఈలు తమ గుర్తింపు పొందిన వర్సిటీలను హెచ్చరించాయి. ఈ నిబంధనల ప్రకారం ‘ఫ్రాంచైజ్’ ఒప్పందాలకు అనుమతి లేదని యూజీసీ ఏఐసీటీఈలు స్పష్టం చేశాయి.
ఇదీ చదవండి: ఏపీ గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలు