Site icon Prime9

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్

govt jobs in Telangana

govt jobs in Telangana

Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ కో-ఆప‌రేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లోని ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో మొత్తం 40 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్, మేనేజ‌ర్ స్కేల్ 1 పోస్టుల‌ను ప్రభుత్వం ఫిల్ చేయనుంది. ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్ధులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తి చెయ్యాలి. ఇతర పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tscab.org/apex-bank/ను సంద‌ర్శించండి.

రాత పరీక్షద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ప‌రీక్ష ద్వారా అభ్యుర్థులను సెలెక్ట్ చేస్తారు.
ప‌రీక్ష ఫీజు రూ.900, ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రూ. 250గా ఫీజు ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 28 అందుబాటులోకి వస్తుంది. రిజిస్ట్రేషన్ లింక్ కూడా రేపే ఓపెన్ అవుతుంది.

దరఖాస్తులను సెప్టెంబర్ 28, 2022 నుంచి అక్టోబర్ 16, 2022 వరకు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ 2022లో నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులు త్వరపడండి.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1535 ఉద్యోగాలు

Exit mobile version