Site icon Prime9

SSC Supplementary Results: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ssc-supplementary-results

Hyderabad: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు ‌www.bse.telangana.gov.in వెబ్‌సైట్​లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 48,167 మంది హాజరుకాగా 38,447 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత 82.21 శాతం కాగా, బాలురు 78.42 శాతం ఉత్తీర్ణత సాధించారు

ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత హాల్‌ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను ఎంటర్‌ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై వస్తాయి.

Exit mobile version