Site icon Prime9

Govt Jobs: న్యాయస్థానాల్లో 3,673 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Notification for filling 3,673 posts in Andhra Pradesh Courts

Notification for filling 3,673 posts in Andhra Pradesh Courts

Govt Jobs: రాష్ట్రంలోని కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మిశ్ర ఆదేశాలు జారీచేశారు. రాష్ర్టంలో భారీగా ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. జిల్లా కోర్టుల్లో 3,432, హైకోర్టులో 241 పోస్టులతో మొత్తం 3,673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాల కోసం హైకోర్టు వెబ్‌సైట్‌ hc.ap.nic.inను సంప్రదించగలరు. పరిపాలన విభాగం రిజిస్ట్రార్‌ ఆలపాటి గిరిధర్‌.. రిజిస్ట్రార్‌ (నియామకాలు)గా బాధ్యతలు నిర్వహిస్తూ ఈ నోటిఫికేషన్లు జారీచేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు హైకోర్టు నడుం బిగించింది.

ఇదీ చదవండి:  “లా” చెయ్యాలనుకుంటున్నారా అయితే అప్లై చేసుకోండి.. “క్లాట్” నోటిఫికేషన్ విడుదల

Exit mobile version