Site icon Prime9

NEET UG-2022 Results: నీట్ ఫలితాలు విడుదల

neet-2022-results

New Delhi: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) ఫలితాలు విడుదలయ్యాయి. రాజస్థాన్ అమ్మాయి తనిష్క మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. తర్వాత వత్స ఆశిష్ బాత్రా మరియు హృషికేష్ నాగభూషణ్ గంగూలే తరువాత స్దానాల్లో నిలిచారు.

ఈ సంవత్సరం నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలో మొత్తం 9.93 లక్షల (9,93,069) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. బాలికలు 56.33 శాతం, బాలురు 56.20 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50వ ర్యాంకు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40వ ర్యాంకు కటాఫ్ గా ఉంది.

అభ్యర్థులు NEET UG 2022 ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్- neet.nta.nic.in ద్వారా తనిఖీ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NEET UG 2022 ఫలితాల అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆపై ‘NEET UG 2022 ఫలితం’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి. అభ్యర్థులు NEET UG 2022 స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం, ప్రింటవుట్ తీసుకోవడం తప్పనిసరి.

Exit mobile version