TSPSC: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది వరకే రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-3 నోటిఫికేషన్ ఇది వరకే విడుదల కాగా.. దానికి సంబంధించి మరో తాజా అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 3 కి సంబంధించి ఉద్యోగాలను పెంచుతూ వెట్ నోట్ ను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. ఇప్పటికే.. గ్రూప్ 4 పోస్టులను పెంచుతూ సబ్ నోటిఫికేషన్ వచ్చింది. తాజాగా గ్రూప్ 3 పోస్టులను పెంచుతూ వెబ్ నోట్ విడుదలైంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..(TSPSC)
రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు విడుదల కావడంతో.. అభ్యర్ధులు పోటీ పడి చదువుతున్నారు. గ్రూప్ 3 కి సంబంధించి టీఎస్ పీఎస్సీ ఇది వరకే నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా ఈ ఉద్యోగాలను పెంచుతూ.. వెబ్ నోట్ విడుదల చేసింది. మరికొన్ని పోస్టులు కలవడంతో.. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 3 కి సంబంధించి.. జనవరి 27న తెలంగాణ ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీ గురుకులాల్లో గ్రూప్-3 ద్వారా.. 12, గ్రూప్-4 కింద 141 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఇది వరకే.. గ్రూప్ 4లో 141 పోస్టులను కలుపుతూ.. టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. తాజాగా గ్రూప్ 3లో 12 పోస్టులను యాడ్ చేస్తూ వెబ్ నోట్ విడుదలైంది. ఈ 12 పోస్టులు మహాత్మాజ్యోతి బాఫూలే గురుకులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఈ పోస్టులకు అర్హతగా.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారుగా పేర్కొన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. కనీస వేతనం రూ.24,280 నుంచి రూ.72,850 మధ్య ఉండనుంది.
భారీగా ఉద్యోగాలు.. పోటీ పడుతున్న అభ్యర్ధులు
ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చింది. తాజాగా అనుమతి ఇచ్చిన వాటితో.. 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇందులో 2,391 ఉద్యోగాల్లో బీసీ గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 1,499 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను గురుకుల నియామక మండలి ద్వారా భర్తీ చేయనున్నారు. ఇది వరకే గురుకుల పోస్టులు 10వేలకు పైగా ఆర్థిక శాఖ ఆమోదించింది. వాటితో పాటు.. ఇవి అదనంగా ఉన్నాయి. ఇక ఈ 1499 పోస్టుల్లో టీచింగ్ పోస్టులతో పాటు.. నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 1363 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా ఈ 12 పోస్టులను కలుపుకుంటే.. 1375కు గ్రూప్ 3 ఉద్యోగాలు పెరిగాయి.
గ్రూప్ 3 కి డిసెంబర్ 30న టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభం అయింది. ఫిబ్రవరి 23 వరకు గడువు తేదీని నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 105 కేటగిరీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ఫీజుగా.. రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. గ్రూప్ 3 పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో ఉండే అవకాశం ఉంది.