Site icon Prime9

EAMCET Free Coaching: తెలంగాణలో ఇంటర్ విద్యార్దులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్

EAMSET

EAMSET

Telangana News: తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇకపై వారు ఎంసెట్ కోచింగ్ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన పనిలేదు. వేలకువేలు ఫీజులు చెల్లించాల్సిన పని కూడా లేదు. ప్రభుత్వమే ఉచితంగా వారికి ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబరులోనే సిలబస్ పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరిలో కళాశాలల్లోనే ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ మెరిట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారిని ప్రతి జిల్లాలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వారీగా 50 మంది బాలురు, 50 మంది బాలికలను ఎంపిక చేయనున్నట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. ఎంపికైన స్టూడెంట్స్‌కు మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత.. ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థులకు ఫ్రీ కోచింగ్‌తో పాటు ఫ్రీ మెటీరియల్ కూడా అందిమన్నారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఎంసెట్ ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల అధికారులు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్స్‌, సిబ్బంది, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి ఉచిత కోచింగ్‌కు సన్నద్ధం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ బోర్డులో సమూల మార్పులు జరగునున్న విషయం తెలిసిందే. ఇక నుంచి ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో కూడా 20 మార్కులను ప్రాక్టికల్స్‌కు, 80 మార్కులు రాత పరీక్షకు కేటాయించనున్నారు. ఎంపీసీ మ్యాథ్స్-2బీలో సిలబస్ ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి కాస్త సిలబస్ తగ్గించనున్నారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రభుత కళాశాలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనూ సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేయనున్నారు.

Exit mobile version