Site icon Prime9

AP 10th Class Results: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ ఫ‌లితాలు విడుదల

AP 10th Class Results:  ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్ర‌వ్యాప్తంగా 3వేల7వందల 43 ప‌రీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఇందులో మొత్తం 6.23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. ఫ‌లితాల్లో బాలిక‌లే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణ‌త శాతం 84.32గా న‌మోదు కాగా, బాలిక‌ల ఉత్తీర్ణ‌త శాతం 89.17గా న‌మోదైంది. మొత్తం 2 వేల 3 వందల స్కూల్స్ లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 17 పాఠశాలలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.

పదిరోజులముందే ఫలితాలు..(AP 10th Class Results)

ఈ సందర్బంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ మార్చి 18 నుంచి 30 వరకు 10 పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పదవతరగతి పరీక్షల్లో ఒక్క విద్యార్ది కూడా మాల్ ప్రాక్టీసుకు పాల్పడలేదని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా లాస్ట్ వర్కింగ్ డే కన్నా ముందే పదవతరగతి ఫలితాలు విడుదల చేసామన్నారు. పదవతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణతా శాతం ఉండగా, కర్నూల్ జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదయిందని తెలిపారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా కూడా తెలుసుకోవచ్చని తెలిపారు.

ఈసారి పదో తరగతి పరీక్షల్లో మాల్‌ ప్రాక్ట్రీస్‌కు అవకాశం లేకుండా. ప్రతి పేపర్‌కు, ప్రతి ప్రశ్నకు క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. దీంతో మాల్‌ ప్రా్క్టీస్‌ చేసినా, పేపర్‌ లీక్‌ అయినా వెంటనే తెలిసిపోతుంది. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లతోపాటు విద్యాశాఖ అధికారులు, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది, పోలీసులు, చీఫ్‌ ఇన్విజిలేటర్లు.. ఎవ్వరూ సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా నిషేధించారు. అలాగే గతంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు సంబంధిత సబ్జెక్ట్ పేపర్‌ వారి చేతికి ఇచ్చేవారు. ఈ ఏడాది రీవ్యాల్యూయేషన్ కోరే వారికి  వెబ్‌ లింక్‌ పంపించనున్నారు. సదరు లింక్‌ను ఓపెన్‌ చేస్తే పేపర్‌ సాఫ్ట్‌ కాపీని స్క్రీన్‌పై చూసుకునేలా ఏర్పాట్లు చేశారు.

 

 

Exit mobile version